బీజేపీ రెండు కళ్ల సిద్ధాంతమా?

Update: 2020-08-07 12:30 GMT
ఉమ్మడి ఏపీ ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమం చెలరేగినప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ‘రెండు కళ్ల సిద్ధాంతం’ను ప్రవేశపెట్టారు. ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అని రెండింటికి తమ మద్దతు అని తప్పించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకున్న ఏపీ బీజేపీ అదే రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిందన్న వాదనను విశ్లేషకులు తెరపైకి తెస్తున్నారు.

ఏపీ రాష్ట్ర బీజేపీ మాత్రం అమరావతి కోసం మేము పోరాడుతాం అని ప్రకటిస్తుంది. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ బీజేపీ మాత్రం మాకు ఏపీ రాజధానితో సంబంధం లేదు అని తేల్చిచెబుతుంది. అది రాష్ట్ర పరిధిలోని అంశమంటుంది. రెండు కళ్ల సిద్ధాంతంతో బీజేపీ ఇలా ఏపీ రాజకీయాల్లో ఊగిసలాడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ ప్లాన్ తోనే 2019 ఎన్నికల్లో 0.8శాతం మాత్రమే ఓటు బ్యాంకును బీజేపీ సంపాదించింది. ఈసారి 0.1శాతం కూడా బీజేపీ నేతలకు రావని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బీజేపీ నేతలు కేవలం టీవీల్లో డిబేట్ లకు పరిమితం అని ప్రజలు కూడా నిట్టూరుస్తున్నారు. ఇలా బీజేపీ రెండు కళ్ల సిద్ధాంతంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 
Tags:    

Similar News