హైదరాబాద్ లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్ .. రూ 16 కోట్లు స్వాధీనం !

Update: 2020-10-12 10:45 GMT
హైదరాబాద్ నగరంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయింది.  హైదరాబాద్‌లో రాజస్తాన్‌ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం తనిఖీలు నిర్వహించింది . ఈ తనిఖీల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న 7 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్న గణేణ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అలాగే ,  ఏడుగురు సభ్యుల నుంచి రూ.16కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ, ముంబై, ఢీల్లీ రాజస్థాన్ కేంద్రంగా క్రికెట్‌ బెట్టింగ్ నడుస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో ఈ ముఠా బెట్టింగ్‌ కు పాల్పడుతోందని తెలిపారు. అరెస్టైన వారిలో గణేష్, సురేష్, పంకజ్,  సత్తయ్యతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఐపీఎల్-2020 మొదలైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా అతిపెద్ద క్రికెట్ బెట్టింగ్‌ ముఠా అని పోలీసులు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ముఠాలను ఏర్పాటు చేసి గణేష్‌ బెట్టింగ్ నడుపుతున్నాడని వెల్లడించారు.

ఐపీఎల్ ప్రారంభమైందంటే చాలా బెట్టింగ్ బుకీలు బయటికొస్తారు. స్మార్ట్ ఫోన్‌ తో స్మార్ట్‌ గా దోపిడీ చేస్తారు.  ఇలాంటి బుకీలు హైదరాబాద్‌లో రంగంలోకి దిగుతారు. కాయ్ రాజా కాయ్ అంటూ ఆన్ లైన్ దందాకు తెరలేపుతారు. ఇలాంటి మఫియాలు తెలుగు రాష్ట్రాల్లోని ఐపీఎల్ ప్రియులను వల వేసి పట్టుకుంటున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు.
Tags:    

Similar News