పెళ్లి చేసుకుంటానని టిక్ టాక్ లేడీపై అత్యాచారం

Update: 2020-05-18 09:30 GMT
టిక్ టాక్.. ఎంత పనిచేస్తోంది. పేరు, ఊరు లేని వాళ్లను పాపులర్ చేస్తుంది.వారి టాలెంట్ ను బయటపెడుతోంది.వారిని సెలెబ్రెటీలను చేస్తుంది. లక్షలమంది ఫాలోవర్స్ ను కలిగేలా చేస్తోంది.  కానీ దాన్ని బేస్ చేసుకొని వల విసిరే వారి చేతిలోనూ మోసపోయేలా చేస్తోంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

టిక్ టాక్ లో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని ఒక వ్యక్తి నమ్మించాడు. నిశ్చితార్థం చేసుకున్నాడు. అనంతరం అత్యాచారం చేశాడు. అనుభవించాడు. మరోసారి అలానే ఎంజాయ్ చేశాడు. అనంతరం పత్తా లేకుండా పోయాడు. మోసపోయానని గ్రహించిన యువతి లబోదిబోమంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పాతబస్తీకి చెందిన యువతి (27)కి గత డిసెంబర్ లో తలాబ్ కట్ట నషేమన్ నగర్ కు చెందిన అక్బర్ షా(34)తో టిక్ టాక్ లో పరిచయం ఏర్పడింది. యువతి వీడియోలు చూసి లైక్ చేసి ఆమెకు ఎరవేసిన అక్బర్ షా యువతిని ప్రేమ పేరిట నమ్మించాడు. యువతి నమ్మడంతో టోలిచౌకిలోని తన సోదరి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానంటూ నాటకమాడాడు.

బంధువుల సమక్షంలో ఉత్తుత్తి నిశ్చితార్థం చేసుకున్నాడు. మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత ఆచూకీ లేకుండా పోవడంతో మోసపోయానని బాధితురాలు బోరుమంది.. ఆదివారం చాంద్రాయణ గుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి ఆరాతీస్తే నిందితుడికి అప్పటికే పెళ్లి అయ్యి నలుగురు సంతానం ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Tags:    

Similar News