జగన్ ఆరోపణల తర్వాత మొదలైన ఇంట్రస్టింగ్ చర్చ

Update: 2020-10-12 09:00 GMT
న్యాయవ్యవస్ధలోని కొందరు కీలకమైన వ్యక్తులపై జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేయటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు ఆరుగురు జడ్జీలతో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలిపాటి శ్రీనివాస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలుపన్నినట్లు ఆరోపించిన విషయం అందరికీ తిలిసిందే. చంద్రబాబునాయుడు ప్రయోజనాలను రక్షించటం కోసమే వీళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు జగన్ సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకు ఎనిమిది పేజీల లేఖను రాశారు. తన ఆరోపణలకు ఆధారాలంటూ కొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు.

ఈ మొత్తం మీద దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, న్యాయ నిపుణులు, మాజీ జడ్జీలు చాలామంది రకరకాలుగా స్పందిస్తున్నారు.  ఈ మొత్తం మీద చూడాల్సిందేమిటంటే  జగన్ చేసిన ఆరోపణలపై సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏ విధంగా స్పందిస్తారనే విషయం చాలా ఆసక్తిగా మారిపోయింది. ఇక్కడే ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. అవేమంటే  జగన్ చేసిన ఆరోపణలపై వెంటనే బాబ్డే ఏ విధంగా స్పందిస్తారు ? విచారణ  చేయిస్తారు ?  అన్నది.

ఇదే విషయమై సీనియర్ అఖిల భారత అధికారి  అశోక్ కెమ్కా మాట్లాడుతూ  ఒకసారంటూ జగన్ ఆరోపణలు చేసిన తర్వాత వెంటనే విచారణ చేయించకపోతే న్యాయవ్యవస్ధపై అందరికీ అనుమానాలు పెరిగిపోతాయన్నారు. విచారణలో  జగన్ చేసిన ఆరోపణలు తప్పయితే జగన్ పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా ? అని సూటిగా ప్రశ్నించారు. ఇదే సమయంలో  ఆరోపణలు వాస్తవమని తేలితే ఆరోపణలకు గురైన వాళ్ళపై సుప్రింకోర్టు ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది ? అంటూ నిలదీశారు.

ముఖ్యమంత్రి నేరుగా కొందరిపై ఆరోపణలు చేసినపుడు విచారణ చేసి తీరాల్సిందే అనే అభిప్రాయాన్ని కూడా కెమ్కా వ్యక్తం చేశారు.  అసలు జగన్ ఆరోపణలపై విచారణ చేయించే ఉద్దేశ్యం సుప్రింకోర్టుకు ఉందా ? అని కూడా ప్రశ్న సంధించారు.  ఆరోపణలు వెలుగు చూసిన నేపధ్యంలో ఏదో ఓ యాక్షన్ తీసుకోకుండా ఉండటం సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదని కూడా కెమ్కా అభిప్రాయపడ్డారు. మరి సుప్రింకోర్టు ఏమి చేస్తుందో చూద్దాం.
Tags:    

Similar News