ఇన్ఫో నారాయణ మూర్తి నోట సంచలన వ్యాఖ్యలు !

Update: 2020-08-12 07:30 GMT
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ మరో రెండు వారాల్లో ముగియబోతుంది. కానీ , దేశంలో కరోనా తగ్గుతున్నట్టు కొంచెం కూడా అనిపించడం లేదు. ఇది ఇలాగే మరెంత కాలం సాగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి సమయాల్లో పలువురు లాక్ డౌన్ కొనసాగిస్తే జరిగే నష్టం భారీగా ఉంటుందన్న అంచనాలు ఒకవైపు.. కొనసాగించకుండా ఎత్తివేస్తే, చోటు చేసుకునే విపరిణామాల మీద మరోవైపు జోరు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దేశ ఐటీ రంగానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి  సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ పొడిగించటం ఏ మాత్రం సమస్యకు పరిష్కారం కాదని, అదే జరిగితే నష్టం భారీగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో దేశ జీడీపీ కనిష్ట స్థాయికి పడిపోతుందనే ఆందోళన అయన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాలని బట్టి చూస్తే 1947 నాటి కనిష్ట స్థాయికి దేశ జీడీపీ పడిపోనుందంటూ తాజాగా హెచ్చరించారు. అంతేకాదు జీడీపీ గణాంకాలు నెగిటివ్ వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. ఇందుకు అన్ని రంగాలు సిద్దంగా ఉండాలని సూచించారు. లీడింగ్ ఇండియా డిజిటల్ రివల్యూషన్ 16వ ఎడిషన్ చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం క్షీణించింది. జీడీపీ పడిపోతోంది. అంతర్జాతీయ ప్రయాణాలు దాదాపు కనుమరుగయ్యాయి. ఫలితంగా జీడీపీ 5 నుంచి 10 శాతం క్షీణించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థలోని ప్రతీ రంగానికి చెందిన వారు తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉంటూ కొత్త వ్యవస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

దేశంలోకి ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. రోజుకు కోటి మందికి  వ్యాక్సిన్ ఇచ్చినా భారతీయులందరికీ టీకాలు వేయడానికి 140 రోజులు పడుతుంది. అప్పటి వరకూ ప్రజలు వైరస్ తో సహజీవనానికి సంసిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలు మాస్క్ లు ధరిస్తూ, భౌతిక దూరాన్నిపాటించడం ముఖ్యమన్నారు. అలాగే, ప్రభుత్వాలు ఆసుపత్రి పడకల సంఖ్యను పెంచడం, పరీక్షల సామర్ధ్యాన్ని పెంచడం లాంటి చర్యలు చేపట్టడం చాలా అవసరం అని తెలిపారు. కరోనావైరస్ కారణంగా తన బంధువు ఒకరు మరణించడాన్ని ప్రస్తావించిన ఆయన టైర్ 2,3 పట్టణాలలో సౌకర్యాల కొరతపై అసంతృప్తి వ్యక్తం చేసారు.
Tags:    

Similar News