మనవాళ్లు పొదుపర్లు అయ్యారట! కరోనా ఎఫెక్టేనా!

Update: 2020-09-26 02:30 GMT
ప్రస్తుతం భారతీయులు పొదుపర్లుగా మారారట. ఆచితూచి ఖర్చుపెడుతున్నారట. హంగులు, ఆర్భాటాలు తగ్గించి అవసరం మేరకే డబ్బులు వాడుతున్నారట. ఇందుకు కారణం కరోనా ఎఫెక్టేనేని తేలింది. భారతీయుల ఖర్చులపై బ్రిటిష్​ లెంటర్​ స్టాండర్డ్​ బ్యాంక్​ ఓ సర్వే నిర్వహించింది. అయితే ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉపాధి తగ్గింది. ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. మరోవైపు పలు కంపెనీలు తమ ఉద్యోగులకిచ్చే వేతనాల్లో భారీ కోతలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రతి 10 మంది భారతీయుల్లో 9 మంది ఖర్చులు పెట్టాలంటే ఒకటి పదిసార్లు ఆలోచిస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల ప్రజల ఆదాయ, వ్యయాలపై స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు సర్వే నిర్వహించింది. బ్రిటన్, హాంగ్‌కాంగ్, భారత్, ఇండోనేసియా, కెన్యా, చైనా, మలేషియా, పాకిస్తాన్, సింగపూర్, తైవాన్, యూఏఈ, అమెరికా ప్రజలపై ఆన్​ లైన్​ సర్వే చేపట్టింది.  ఇప్పటికే జూలైలో ఓ సారి సర్వే నిర్వహించగా.. తాజాగా రెండో సర్వే ఫలితాలను వెల్లడించారు.

ఆ విషయంలో భారతీయులు టాప్​
ఆచితూచి ఖర్చులు పెట్టడం. ఖర్చులు తగ్గించుకోవడంలో మిగతా దేశాల ప్రజలతో పోల్చుకుంటే భారతీయులు ముందున్నారట. ఉద్యోగాలు, ఆర్థిక భారంపై ప్రతి పదిమందిలో తొమ్మిది మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని.. అందువల్లే వాళ్లు ఖర్చులు చాలా లిమిట్​ గా పెడుతున్నారని సర్వే తెల్చింది. ఏదైనా అత్యవసరం అయితే ఆన్‌ లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు 78 శాతం మంది భారతీయులు చెప్పారు. అంతర్జాతీయ సగటు 66 శాతం మాత్రమే ఉంది. కరోనా మహమ్మారికి ముందు ఆన్ లైన్ కొనుగోలుదారుల సంఖ్య 54 శాతంగా ఉంది. కరోనా వేళ ప్రయాణాలు, విహార యాత్రలు తగ్గించుకుంటామని 64 శాతం మంది భారతీయులు చెప్పారు.  ప్రపంచ సగటు కూడా ఇది 64 శాతంగా ఉంది. దుస్తులపై ఖర్చును తగ్గించుకుంటామని 56 శాతం మంది భారతీయలు చెప్పారట. ప్రపంచ వ్యాప్తంగా 55 శాతం మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారట.
Tags:    

Similar News