ట్రంప్ ను ఓడించాలని భారతీయ ఓటర్లు డిసైడ్ అయ్యారట
ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తాజాగా ఒక సర్వేను నిర్వహించారు. ఇటీవల కాలంలో జరుపుతున్న సర్వేల్లో అధ్యక్షుడు ట్రంప్ తో పోలిస్తే డెమొక్రాట్ల అభ్యర్థి జోబైడెన్ కే పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లుగా తేలుస్తున్నాయి. తాజాగా అమెరికాలోని భారతీయ ఓటర్లు ఏటువైపు ఉన్నారు? ఈసారికి వారి ఓటు ఎవరికి అన్న విషయం మీద స్పష్టత ఇచ్చే సర్వే ఫలితం ఒకటి బయటకు వచ్చింది. అమెరికాలోని హ్యాప్కిన్స్ వర్సిటీ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం.. అమెరికాలోని భారతీయ ఓటర్లు ఈసారి తమ ఓటు ఎవరికన్న విషయంపై స్పష్టతకు వచ్చినట్లుగా పేర్కొంది.
నూటికి 72 శాతం మంది అమెరికన్ భారతీయులు తమ ఓటును ట్రంప్ కు వ్యతిరేకంగా వేయాలని.. జో బైడెన్ పక్షాన నిలవాలని డిసైడ్ అయినట్లుగా పేర్కొన్నారు. ట్రంప్ నకు సర్వేలో పాల్గొన్న వారిలో 22 శాతం మందే ఓటు వేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు వెయ్యి మందిలో ఈ సర్వేను నిర్వహించారు. అమెరికాలో సుమారు 26 లక్షలకు పైనే ఇండో అమెరికన్లు ఉన్న విషయం తెలిసిందే. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో వీరి ఓటు కీలకం కానుంది.
నిజానికి భారతీయ ఓటర్ల మనసు దోచుకోవటానికి ట్రంప్ ఎంతో ప్రయత్నించారు. అందులో భాగంగానే ప్రధాని మోడీని అమెరికాకు ఆహ్వానించి.. హోడీ-మోడీ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించి.. తనకు అనుకూలంగా ఉండాలన్న విషయాన్ని ప్రధాని మోడీ నోటి నుంచే చెప్పించే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. మోడీ..ట్రంప్ మధ్య సంబంధాలు మంచిగా ఉండటంతో ఆయన మరోసారి దేశాధ్యక్షులు కావాలన్న ఆకాంక్షను అప్పట్లో మోడీ మాటల్లో వినిపించటాన్ని మర్చిపోలేం.
మోడీ సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలకు ట్రంప్ బాసటగా నిలిస్తే.. బైడెన్ కొన్నింటి విషయాల్లో విమర్శలు చేశారు. అయితే.. స్థానిక నినాదం పేరుతో ట్రంప్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయులకు.. అమెరికాలో ఉన్న భారతీయులకు దెబ్బ కలిగే పరిస్థితి. దీనికి తోడు.. ట్రంప్ దూకుడు.. ఆయన నోటి నుంచి వచ్చే మాటల విషయంలో భారతీయ అమెరికన్లు గుర్రుగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో షాకివ్వాలని డిసైడ్ అయినట్లుగాతాజా సర్వే ఫలితం చెబుతోంది. మరి.. ఈ సర్వే ఫలితం ఎంత వరకు నిజమన్నది అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో తేలనుంది.