సైనా పాలిటిక్స్ పై గుత్తా జ్వాల ఘాటు ట్వీట్
రాకెట్ పట్టిన చేతులు రాజకీయం చేస్తామని బయలు దేరాయి.. క్రీడల్లో ఇక కెరీర్ ముగిసిపోయినవారంతా రాజకీయాల బాట పట్టడం దేశంలో ట్రెండ్ గా మారింది. అజారుద్దీన్, గౌతమ్ గంభీర్, సిద్దూ, సచిన్ సహా చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి ఎంపీలుగా, కేంద్ర మంత్రులు గా అవుతున్నారు.
ఇప్పుడు ఒకప్పుడు బాడ్మింటన్ లో వెలుగు వెలిగిన సైనా నెహ్వాల్ కూడా తన కెరీర్ అంతిమ దశకు చేరుకోవడం.. పెద్దగా విజయాలు వరించక పోవడంతో ఇక రాజకీయాల బాట పట్టారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే..
సైనా అనూహ్యంగా ఇలా బీజేపీలో చేరడంపై ఆమె సహచర క్రీడాకారిణి అయిన గుత్తా జ్వాల స్పందించింది. ఈ మేరకు గుత్తా ట్వీట్ వైరల్ గా మారింది.
‘ఇప్పటివరకూ రాకెట్ తో అర్థంపర్థం లేని ఆటలే ఆడావ్ అని అనుకున్నానని.. కానీ ఇప్పుడు అర్థంపర్థం లేని పార్టీలో చేరిపోయావని.. దీని ప్రభావం కెరీర్ పై పడుతుంది’ అనే రీతిలో గుత్తా జ్వాల ట్వీట్ చేసింది. బీజేపీలో సైనా చేరికను ఓరకంగా గుత్తా తప్పుపట్టింది. కమలదళంపై కూడా సెటైర్లు వేయడం విశేషం. గుత్తా బీజేపీ కి వ్యతిరేకం గా చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై సైనా ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.