పాకిస్థాన్ ​కు ముడిందా? సరిహద్దుల్లో యుద్ధమేఘాలు! మోహరించిన ఇరు సైనకదళాలు

Update: 2020-11-14 12:10 GMT
ఇటీవల కాలంలో పాకిస్థాన్​ తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. సరిహద్దుల్లో వ్యవసాయం చేసుకుంటున్న అమాయక రైతులపై కాల్పులు జరుపుతూ భారత బలగాలను రెచ్చగొడుతున్నది. సరిహద్దుల్లో ఉగ్రమూకలతో కలిసి క్యాంపులు పెట్టి కయ్యానికి కాలుదువ్వుతున్నది. అయితే పాక్ దుశ్చర్యలకు భారతబలగాలు దీటైన సమాధానం చెప్పారు. ఇప్పటికే పాకిస్థాన్  సైన్యం బార్డర్​లో జరిపిన కాల్పుల్లో పాక్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11కి చేరింది. శుక్రవారం మొత్తం మూడు చోట్ల పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడగా.. దాయాది దురాగతానికి భారత్‌ దీటుగా బదులిచ్చింది. శత్రు దేశం సైనిక శిబిరాలపై శతఘ్నలు, రాకెట్లు, ట్యాంకు విధ్వంసక గైడెడ్‌ క్షిపణులతో దాడి చేసింది.

 మన ఆయుధాలు పాక్ పటిష్ఠ బంకర్లను ధ్వంసం చేస్తున్న వీడియోలను భారత సైన్యం విడుదల చేసింది.పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఒక పర్వత పంక్తిపై ఉన్న కాంక్రీటు బంకర్‌ కనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత అది మొత్తం ధ్వంసమైంది. చాలా దూరం నుంచి భారత శతఘ్ని దళం ఫిరంగును ప్రయోగించినా లక్ష్యం గురితప్పలేదు. మరో వీడియోలో.. సర్రున దూసుకొచ్చిన ఒక ట్యాంకు విధ్వంసక గైడెడ్‌ క్షిపణి సరాసరి ఒక బంకర్‌ను ఢీ కొట్టింది. కొన్ని సెకన్ల తర్వాత మరో రెండు క్షిపణులు ఆ బంకర్‌ను ధ్వంసం చేశాయి. భారత ప్రతిదాడిలో సైనిక శిబిరాలతోపాటు ఆయుధ డిపోలు, ఇంధన డంప్‌లు, ఉగ్రవాద శిబిరాలు నేలమట్టమయ్యాయి.

 భారత్​ మెరుపుదాడిలో స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ (ఎస్‌ఎస్‌జీ) కమాండోలు సహా 8 మంది పాక్‌ సైనికులు హతమైనట్లు, 12 మంది గాయపడినట్లు పొరుగు దేశపు సైనిక కమ్యూనికేషన్లను రహస్యంగా ఆలకించిన మన సైనిక వర్గాలు తెలిపాయి. అయితే భారత సైన్యం కాల్పుల్లో తమ సైనికుడొకరు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారని పాక్‌ సైన్యం ప్రకటించింది. అయితే ప్రస్తుతం సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయి. ఇరు దేశాలూ 105 ఎంఎం, 150 ఎంఎం ఆర్టిలరీ తుపాకులు, యాంటీ-ట్యాంకు గైడెడ్ క్షిపణులు, భారీ మోర్టార్లతో మోహరించి ఉన్నాయి. ఏ క్షణం ఏంజరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొన్నది. ‘
Tags:    

Similar News