మళ్లీ మొదలెట్టిన చైనా ... దురాక్రమణ వ్యూహమే , డోక్లాంలో సొరంగ మార్గం పొడగింపు !
గతంలో భారత్, చైనాల మధ్య వివాదాలకు కారణమైన డోక్లామ్ లో మళ్లీ కలకలం రేగింది. డోక్లాంలో చైనా మళ్లీ వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రాంతానికి సమీపంలో సొరంగాలు, బ్యారక్ ల లాంటి భారీ నిర్మాణాలను చేపట్టింది. ఈ పనులు గురించి భారత బలగాలకు తెలియనీకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయితే , అప్పుడు చైనా ఆటలు భారత్ ముందు సాగలేదు. దీనితో అప్పట్లో ఆ నిర్ణయం నుండి వెనక్కి తగ్గిన చైనా , తాజాగా తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. అక్రమ సొరంగ మార్గం ద్వారా డోక్లాం పీఠభూమిలోకి ప్రవేశించి రోడ్డు నిర్మాణ పనులు చక్కబెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం మెరుగ్ లా పాస్ వైపు నుంచి డోక్లాం పీఠభూమిలోకి సొరంగం మార్గం నిర్మిస్తోంది.
దీని ద్వారా చలికాలంలో సైతం డోక్లాంలో తమ బలగాలను మోహరించడానికి... అక్కడ నిర్మాణ పనులను చేపట్టడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో 2017లో చైనా భారత్ మధ్య 70 రోజుల పాటు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలోని చైనా నిర్మాణ కార్మికులు ఉపరితల సొరంగమార్గాన్ని 500 మీటర్ల వరకు పొడిగించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. శీతాకాలంలో ఈ మార్గం అంతా మంచుతో కప్పబడి ఉంటుందని, దానికోసమే ఏ కాలంలోనైనా ప్రయాణించేలా ఈ రవాణా సౌకర్యాన్ని పెంచుకున్నట్లు స్పష్టమౌతోందని సైనిక నిపుణులు భావిస్తున్నారు.డోక్లాంకు ఉత్తరాన అధిక ఎత్తులో ఉన్న మెరుగ్ లా వైపు నుంచి అక్కడికి చేరుకునేలా సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నట్లు ఆ శాటిలైట్ చిత్రంలో కనిపిస్తోంది.
అగస్టు 2019 నాటి శాటిలైట్ చిత్రంతో ఈ విషయం వెల్లడవగా, ఆ తర్వాత అక్టోబర్ లో వెలుగుచూసిన మరో శాటిలైట్ చిత్రంలో చైనీస్ వర్కర్స్ ఆ సొరంగ మార్గాన్ని 500మీ. మేర విస్తరించినట్లు తేలింది.ఏ ప్రయోజనాలను ఆశించి చైనా ఈ నిర్మాణాన్ని చేపడుతుందో క్లియర్ గా కనిపిస్తూనే ఉందని భారత ఆర్మీ నిపుణులు అంటున్నారు. . నిజానికి ఇది భూటాన్ భూభాగం కాగా... చైనా అది తమదేనని వాదిస్తోంది. అంతే కాదు,సైన్యాన్ని మోహరించి రోడ్డు నిర్మాణం కూడా మొదలుపెట్టింది. అయితే భారత బలగాలు రంగం లోకి దిగి చైనా ను అడ్డుకోవడం తో అక్కడ డ్రాగన్ ఆటలు సాగలేదు. భూటాన్ కు మద్దతుగా భారత్ అక్కడ చైనా ను గట్టిగా నిలువరించింది. ఈ విషయం లో భారత్, భూటాన్ కి మద్దతిస్తోంది.