డ్రాగన్ సైన్యం కకావికలు..సరిహద్దుల్లో కీలక ప్రాంతాలు భారత్ వశం

Update: 2020-09-24 02:30 GMT
భారత్​​-చైనా సరిహద్దు లో కొంత కాలంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా తూర్పు లద్దాఖ్​ లో భారతబలగాలు కొంతమేర పై చేయి సాధించినట్టు సమాచారం. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో మనదేశం ఓడిపోయింది. దీంతో భారత్ ​కు చెందిన చాలా భూభాగాలు చైనా ఆధీనంలోనే ఉన్నాయి. అప్పటి నుంచి అనేక ప్రధానులు మారారు. వారంతా చైనాతో ఈ విషయంపై చర్చించారు. అయినప్పటికీ చైనా మాత్రం మన భూభాగాన్ని ఇచ్చేందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ఈ నేపథ్యం లో తాజాగా జరిగిన ఓ పరిణామం తో చైనా అప్పుడు ఆక్రమించుకున్న కొన్ని ప్రాంతాలు భారత్​ వశమయ్యాయి. లద్దాఖ్ తూర్పు ప్రాంతంలో ఉన్న మొత్తం 20 పర్వత శ్రేణులు ఉన్నాయి. వీటిలో ఫింగర్స్​ గా పిలువబడే 8 పర్వత శ్రేణులు చాలా కీలకమైనవి. ఈ ప్రాంతంలో  మనసైన్యాలు కీలకమైన ఎనిమిదింటిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. లద్దాఖ్​ తూర్పు ప్రాంతాల్లో ఫింగర్స్​ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి. ఇవన్నీ ఒకప్పుడు భారత్​ వే. అయితే చైనా వీటిని యుద్ధం లో ఆక్రమించుకుంది.  

ఈ ఎత్తైన కొండప్రాంతాల్లో చైనా సైనికులు మకాం వేసి ఎప్పటికప్పుడు భారత సైనికుల కదలికలను పసిగట్టేవారు. దీంతో ఈ గుట్టలు మన సైన్యానికి తీవ్ర చికాకును కలిగించేవి. ఈ నేపథ్యంలో భారత సైనికులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రస్తుతం వాటిని చేజిక్కించుకున్నారు. గాల్వాన్​ లోయలో చైనా సైనికుల దాడిలో 20 మంది మన సైనికులు ప్రాణాలు కోల్పోయాక తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అప్పటి వరకు కేవలం ఆత్మ రక్షణకు మాత్రమే పరిమితమైన మనసైన్యాలు ఒక్కసారిగా ఎదురుదాడులు చేపట్టాయి. భారత బలగాల దాడిలో 40 మందికి పైగా చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.

అయితే దీనిపై చైనా అధికారిక మీడియా ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు తాజాగా జరిగిన ఘటనతో చైనా ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఓ వైపు చైనా కంపెనీలకు చెందిన యాప్స్​ నిషేధించడం.. మరో వైపు భారత్  భూభాగాలను స్వాధీనం చేసుకుంటుండం తో ఆ దేశం ప్రతికారేచ్చతో రగిలిపోతున్నది. ప్రస్తుతం భారత సైన్యం అన్ని పరిస్థితులకు సిద్ధంగా ఉంది. సరిహద్దులో యుద్ధ ట్యాంకులను, యుద్ధ విమానాలను, క్షిపణి ప్రయోగాల లాంచింగ్ ప్యాడ్లను, హెలికాప్టర్లను  రంగంలోకి దించింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు చైనా ప్రభుత్వం యత్నిస్తున్నట్టు సమాచారం.
Tags:    

Similar News