చైనా నక్కజిత్తులు.. సైనికులపై మానసిక దాడి

Update: 2020-09-17 06:15 GMT
ప్రస్తుతం ఇండియాతో నేరుగా యుద్ధం చేసే అవకాశం లేక పోవడంతో చైనా కొత్త తరహా యుద్ధ తంత్రానికి తెరలేపింది. అందులో భాగంగా సరిహద్దుల్లో మన సైన్యంపై మానసిక దాడిని చేస్తోంది. లౌడ్ ​స్పీకర్లలో పంజాబీ పాటలను ప్లే చేస్తూ నెగిటివ్​ వైబ్రేషన్స్​ క్రియేట్​ చేసేందుకు కుట్రలు పన్నుతోంది.చైనాకు చెందిన పలు యాప్​లను భారత ప్రభుత్వం నిషేధించడంతో ఆ దేశం జీర్ణించుకోలేకపోతోంది. సరిహద్దుల్లో సైనాన్ని మోహరించి రెచ్చగొడుతోంది. వాస్త వాధీన రేఖ వద్ద ప్రతిరోజూ  కవ్వింపు చర్యలకు పాల్పడుతుతోంది.

 తాజాగా మరోసారి లడఖ్​ సమీపంలోని వాస్తవాధీన రేఖవద్ద చైనా సైనికులు మరోసారి బరితెగించారు. భారత జవాన్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు కొత్త ఎత్తులు వేశారు. భారత జవాన్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు సరిహద్దు వద్ద లౌడ్ ​స్పీకర్ల లో హిందీ పాటలను పెడుతూ సైన్యాన్ని కవ్విస్తున్నారు. మన సైనికుల నిద్ర పోతున్న వేళ  పంజాబీ పాటలు పెడతూ వారి నిద్రను చెడగొట్టేందుకు చైనా సైన్యం యత్నిస్తున్నది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పాంగ్యాంగ్ త్సొ సరస్సు దక్షిణ ప్రాంతం, ఫింగర్-4, మోల్డో గ్యారిసన్, ఛుసుల్ సెక్టార్ ప్రాంతాల్లో చైనా సైనికులు లౌడ్ స్పీకర్లను అమర్చారు. మనసైనికుల నైతిక స్థైర్యం  దెబ్బ తినేలా పాటలను ప్లే చేస్తున్నారు. విషాద గీతాలను వినిపిస్తూ మన సైనికుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ఈ కుట్రలు పన్నారు.


ఇదో యుద్ధ వ్యూహమా!
చైనా కు చెందిన ప్రముఖ మిలటరీ యుద్ధ వ్యూహకర్త సున్​ ట్టు  ‘ఆర్ట్​ ఆఫ్​ వార్​ ట్రిక్స్​’ అనే ఓ పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం లో చెప్పినట్టుగానే ప్రస్తుతం చైనా వ్యూహాన్ని అమలు పరుస్తున్నట్టు సమాచారం. ఆ పుస్తకంలో చెప్పినట్టుగానే యుద్ధంలో ప్రత్యర్థుల మానసిన స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతున్నట్టు సమాచారం. భారత ప్రభుత్వం సైన్యాన్ని పట్టించుకోవడం లేదని.. గడ్డగట్టే మంచులో వారికి దుప్పట్లు కూడా ఇవ్వడం లేదని.. వారికి తగిన జీతభత్యాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నదని ఇప్పటి కే చైనా కు చెందిన అధికారిక పత్రిక కథనాలను వండివార్చింది.
Tags:    

Similar News