ఢిల్లీ అల్లర్లపై ఆదేశాలు....హైకోర్టు సీజే బదిలీ?
ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ హింసాకాండలో మరణించిన వారి సంఖ్య తాజాగ 34కు చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న హింసాకాండకు బీజేపీ నేతలే కారణమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ విద్వేష ప్రసంగాల వల్లే ఢిల్లీలో హింస తీవ్రస్థాయికి చెలరేగిందని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ మురళీధర్ విచారణ జరిపారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నలుగురు బీజేపీ నేతలపై హైకోర్టు సీజే మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించిచారు. సరిగ్గా, ఈ ఆదేశాలు వెలువడిన 48 గంటలు తిరగ్గముందే హైకోర్టు సీజే మురళీధర్ పై బదిలీ వేటు పడింది.
బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, అభయ్ వర్మ, పర్వేష్ వర్మల ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను హైకోర్టు సీజే మురళీధర్ పరిశీలించారు. వారిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. కాల్పుల్లో ధ్వంసమైన ఆస్తి నష్టాలకు సంబంధించి ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయడంలో అసమానతను చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయలేదని ప్రశ్నించారు. ఒక వర్గానికి చెందిన క్షతగాత్రులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించడాన్ని అడ్డుకోవద్దని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రుల తరలింపులో సహకరించాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఎస్ మురళీధర్ బదిలీ కావడం ప్రాధాన్యతను సంతరిచుకుంది. మురళీధర్ ను పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత గెజిట్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
హైకోర్టు సీజే మురళీధర్ బదిలీపై విమర్శలు వస్తున్నాయి. పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించినందుకే కక్ష పూరితంగా ఆయనపై బదిలీ వేటు పడిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్రం పక్షపాత ధోరణికి ఈ బదిలీ నిదర్శనమని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. వాస్తవానికి మురళీధర్ బదిలీ గురించి కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 12వ తేదిన సుప్రీంకోర్టు కొలిజీయం ఆయన బదిలీకి ప్రతిపాదించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ అప్పటి నుండి ఆందోళన చేస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో బదిలీ కావడం విమర్శలకు తావిస్తోంది.