క్యూఆర్ సామ్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత దేశ రక్షణ కోసం పూర్తిస్థాయి క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసే దిశగా భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో భారీ ముందడుగు వేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కీలక క్షిపణులను మంగళవారం విజయవంతంగా పరీక్షించింది.
అన్నిరకాల వాతావరణాల్లో పనిచేస్తే ‘క్విక్ రియాక్షన్ సర్ఫేస్ -ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్ సామ్) క్షిపణుల్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది.గత శుక్రవారం ఒకసారి పరీక్షించి చూడగా.. తాజాగా మరోసారి మంగళవారం పరీక్షించి విజయవంతమైందని ప్రకటించారు. గడిచిన ఐదురోజుల్లో ఇది రెండో ‘క్యూఆర్ సామ్’ సిస్టమ్ టెస్ట్ కావడం విశేషం. ఈనెల 13న ఒకసారి దీన్ని విజయవంతంగా పరీక్షించినప్పటికీ ఇవాల్టి పరీక్షలో క్షిపణిలోని వార్ హెడ్ల పనితీరును పరీక్షించారు.
ఒడిషాలోని చందీపూర్ లోగల ఇంటిగ్రేడెట్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ల ద్వారా ఈ అధునాతన క్షిపణులను పరీక్షించారు. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఈ క్షిపణి 25 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడి చేస్తుంది. .
యుద్ధరంగంలో శత్రు విమానాలను కూల్చగల ఈ క్షిపణి పరిధి 30 కిలోమీటర్లు. దీని స్వల్ప రేంజ్ క్షిపణిని ఆర్మీ, వైమానికదళం పరీక్షించనుంది. ఆ తర్వాత ఉత్పత్తిలోకి వెళ్లేముందు మరోసారి పరీక్షలు చేస్తారు.
పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ లలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ మిస్సైళ్ల తయారీ, పరీక్షలకు ప్రాధాన్యం ఏర్పడింది.