డ్రాగ‌న్‌ కు ద‌డ పుట్టిస్తున్న అగ్ని 5

Update: 2018-01-19 05:36 GMT
ఎవ‌రు అడిగినా అడ‌గ‌కున్నా శాంతితో వ్య‌వ‌హ‌రిస్తూ.. ఆయుధాల ప‌రీక్ష‌ల‌న్ని స్వ‌ర‌క్ష‌ణ కోసం త‌యారు చేసుకునే త‌త్త్వం భార‌త్ ది. ఈ త‌ర‌హా మైండ్ సెట్ ఉన్న దేశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అందుకు భిన్నంగా నిత్యం ప‌క్కోడి ప్రాంతం మీద క‌న్నేసే దేశాలు మ‌న ప‌క్క‌నే చైనా.. పాక్ లు క‌నిపిస్తాయి. నిత్యం ఏదో ర‌కంగా మ‌న భూమిని ఆక్ర‌మించుకోవాల‌నే కుటిల య‌త్నాల‌కు చెక్ చెప్పట‌మే కాదు.. మ‌న ఆయుధ సామ‌ర్థ్యం స‌త్తా ఏమిటో తెలిసేలా చేస్తోంది అగ్ని 5.
 
భారీ అణు సామ‌ర్థ్యం ఉన్న ఖండాంత‌ర క్షిప‌ణి అగ్ని 5 ను ఇప్పుడు స‌క్సెస్ ఫుల్ గా ప్ర‌యోగించ‌టం చైనాకు చెమ‌ట‌లు పుట్టేలా చేస్తున్నాయి. అగ్ని 5 స‌క్సెస్ అయితే చైనాకు చెమ‌ట‌లెందుకు? అంటే.. అస‌లు విష‌యం అక్క‌డే ఉంది మ‌రి. ఇప్ప‌టివ‌ర‌కూ మ‌న‌కు ఆయుధ సామ‌ర్థ్యం ఉన్న‌ప్ప‌టికీ.. చైనాను టార్గెట్ చేసే విష‌యంలో వెనుక‌బ‌డి ఉన్నాం. మ‌న దేశంలో ఏ ప్రాంతాన్నానైనా టార్గెట్ చేసేందుకు వీలుగా.. మ‌న స‌రిహ‌ద్దుల్లోకి చొచ్చుకొచ్చేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్న చైనాకు అగ్ని 5  ప్ర‌యోగ స‌క్సెస్ షాకివ్వ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

భార‌త అమ్ముల‌పొదిలో ఇంత‌వ‌ర‌కున్న క్షిప‌ణుల్లో అత్యంత ప‌వ‌ర్ ఫుల్ క్షిప‌ణిగా చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా ఒడిశాలోని అబ్దుల్ క‌లాం ద్వీపం నుంచి విజ‌య‌వంతంగా ప్ర‌యోగించిన ఈ క్షిప‌ణి ఎంత ప‌వ‌ర్ ఫుల్ అంటే.. చైనాలోని ఉత్త‌ర ప్రాంతాల్లో ఉన్న టార్గెట్ ను రీచ్ కాగ‌ల‌దు. అగ్ని 5 క్షిప‌ణి ప్ర‌యోగం స‌క్సెస్ కావ‌టంతో ఆసియాలో బ‌లాబ‌లాల్లో మార్పు రానుంది.

ఈ క్షిప‌ణితో భార‌త్ ఖండాంత‌ర బాలిస్టిక్ మిస్సైల్ క్ల‌బ్ లో అమెరికా.. ర‌ష్యా.. చైనా.. యూకే.. ఫ్రాన్స్ స‌ర‌స‌న చేరిన‌ట్లైంది. భారీ అణు సామ‌ర్థ్యం ఉన్న అగ్ని 5 పుణ్య‌మా అని చైనాలోని చాలా ప్రాంతాల్ని స‌ర్వ‌నాశ‌నం చేసే స‌త్తా మ‌న‌కు వ‌చ్చేసిన‌ట్లే. 5వేల కిలోమీట‌ర్ల టార్గెట్‌ను ఈజీగా చేధించే అగ్ని 5 క్షిప‌ణి పొడ‌వు 17 మీట‌ర్లు. అగ్ని 5 ప్రయోగం స‌క్సెస్ కావ‌టంతో చైనాకు ద‌డ పుట్టిస్తోంది. గ‌తంలో మాదిరి త‌న‌కున్న ఆయుధ సంప‌త్తితో భార‌త్ ను ఇరుకున ప‌డేసే ధోర‌ణికి అగ్ని 5 చెక్ పెట్టింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News