లవర్స్ డే : పూలు వద్దు.. కం*డోమ్స్ ముద్దు.. ఎగబడి కొన్నారుగా..

ప్రేమను వ్యక్తపరచడంలో గులాబీ పువ్వుకే ప్రత్యేక స్థానముందని చాలా కాలంగా భావిస్తుంటాం. అయితే కాలం మారుతోంది… ప్రేమను వ్యక్తపరిచే విధానాలు కూడా మారుతున్నాయి.;

Update: 2026-02-18 09:49 GMT

ప్రేమను వ్యక్తపరచడంలో గులాబీ పువ్వుకే ప్రత్యేక స్థానముందని చాలా కాలంగా భావిస్తుంటాం. అయితే కాలం మారుతోంది… ప్రేమను వ్యక్తపరిచే విధానాలు కూడా మారుతున్నాయి. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా యువత ప్రాధాన్యతలు గణనీయంగా మారినట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. పూలు, టెడ్డీ బేర్లు, గిఫ్ట్స్ కంటే ‘సేఫ్టీ’ , ‘ఇంటిమసీ’కి సంబంధించిన ప్రొడక్టులకే ఎక్కువ డిమాండ్ కనిపించడం విశేషం.

క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఈ వాలెంటైన్స్ డే రోజున గులాబీలు, గిఫ్ట్స్ కంటే కండోమ్స్ , శృంగార అనుబంధ ఉత్పత్తుల ఆర్డర్లు భారీగా పెరిగాయి. గతంతో పోలిస్తే ఈ సారి ఆర్డర్లలో స్పష్టమైన మార్పు కనిపించిందని సంస్థ పేర్కొంది.

ప్రత్యేకంగా మెట్రో నగరాల్లో ఈ ట్రెండ్ మరింత స్పష్టంగా కనిపించింది. బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ నగరాలు ఈ విభాగంలో టాప్‌లో నిలిచాయి. ప్రేమికులు పూలు ఇచ్చే సాంప్రదాయానికి కట్టుబడి ఉండకుండా ప్రాక్టికల్ ఆలోచనతో సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక గిఫ్టింగ్ విభాగంలో చాక్లెట్స్ ఇప్పటికీ తమ ప్రాధాన్యతను నిలబెట్టుకున్నాయి. మొత్తం ఆర్డర్లలో చాక్లెట్స్ రెండో స్థానంలో ఉండగా.. టెడ్డీ బేర్లు మూడో స్థానంలో నిలిచాయి. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై నగరాల్లో చాక్లెట్స్, టెడ్డీ బేర్ల ఆర్డర్లు గణనీయంగా నమోదయ్యాయి.

కోల్‌కతాలో ఓ వినియోగదారు ఏకంగా రూ.25 వేల విలువైన చాక్లెట్స్ కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇది ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా నమోదైన హైలైట్ ఆర్డర్‌గా నిలిచింది.

సామాజిక మాధ్యమాల ప్రభావం, యువతలో మారుతున్న ఆలోచనలు, ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన ఈ మార్పుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రేమను కేవలం గిఫ్ట్స్‌తో కాకుండా బాధ్యతతో కూడిన సంబంధంగా చూసే దిశగా యువత అడుగులు వేస్తోందని వారు పేర్కొంటున్నారు.

మొత్తంగా చూస్తే వాలెంటైన్స్ డే సంబరాల్లో ‘రోజా పువ్వు’ ప్రాధాన్యత తగ్గి, ‘సేఫ్టీ , అవగాహన’కు ప్రాధాన్యత పెరుగుతున్న కొత్త ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది సమాజంలో వస్తున్న మానసిక మార్పుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

Tags:    

Similar News