కాంగ్రెస్ ప్లస్ కాక్రోచ్ ...నవంబర్ ఫస్ట్ హీట్ !

ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు వేరు, కాక్రోచ్ పార్టీ ఉద్యమాలు వేరు. అయితే తొలిసారిగా రెండూ ఒక్కటిగా రాబోతున్నాయి.

Update: 2026-10-29 03:41 GMT

ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు వేరు, కాక్రోచ్ పార్టీ ఉద్యమాలు వేరు. అయితే తొలిసారిగా రెండూ ఒక్కటిగా రాబోతున్నాయి. నవంబర్ ఒకటిన ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్ష ఇండియా కూటమి చేపడుతున్న భారీ ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ తన పూర్తి మద్దతు ప్రకటించింది. రామ్ లీలా మైదానంలో నిర్వహించే ఈ ర్యాలికి తాము అండగా నిలిస్తామని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. దాంతో నవంబర్ ఒకటి ఢిల్లీ వీధులు హోరెత్తి వేడెక్కిపోతాయా అన్న చర్చ మొదలైంది.

అనుభవంతో ఆవేశం :

కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి పార్టీలకు రాజకీయంగా విశేషమైన అనుభవం ఉంది. ఇక సీజేపీకి ఆవేశం అంతటా ఉంది. జెన్ జీలకు కేరాఫ్ గా అసలైన వేదికగా సీజేపీ నిలిచి తొడ కొడుతోంది. అయితే అనుభవం లేకపోవడం వల్లనే అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద భారీ ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పి మరీ చేయలేకపోయింది. దీప్కే సహా కీలక నేతలను ముందస్తు గా అరెస్టు చేసి మరీ సీజేపీ ఆవేశాన్ని అలా అణచివేశారు. దాంతో సరైన సమయం కోసం సీజేపీ చూస్తోంది. ఇక సీజేపీ నేతలను అరెస్ట్ చేసి జైలులో పెడితే రాహుల్ గాంధీ వారికి మద్దతుగా మాట్లాడారు. దాంతో సీజేపీ కాంగ్రెస్ ల మధ్య కొత్త స్నేహం ఏర్పడింది. అది ఇపుడు మరి కాస్తా ముందుకు సాగి కాంగ్రెస్ కి మేము సపోర్ట్ అని సీజేపీ ఓపెన్ గానే ప్రకటించగలిగింది.

జ్ఞానేశ్‌ దిగిపోవాలి :

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ పదవి నుంచి దిగిపోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు అని మండిపడింది. సర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. పాలకులు ఎవరో ప్రజలదే నిర్ణయం అని వారి తీర్పు శిరోధార్యం అని సీజేపీ అంటోంది. అంతే తప్ప ఎవరెవరు ఓటు వేయాలి అన్నది ప్రభుత్వం నిర్ణయించరాదు అని సీజేపీ స్పష్టంగా చెబుతోంది. అర్హులైన ఓటర్ల ఓట్ల కోసం పోరాటం చేస్తామని చెబుతోంది. ఎన్నికల సంఘం మీద నమ్మకం కలగాలీ అంటే జ్ఞానేశ్‌ కుమార్‌ పదవి నుంచి దిగిపోవాలని సీజేపీ కోరుతోంది.

సీజేపీ కలిస్తే :

ఇదిలా ఉంటే సీజేపీకి చెందిన నేతలు ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ తో కలసి ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొంటారా అన్నది ఒక చర్చ. నిజంగా వారు కలిస్తే మాత్రం మరింతగా విపక్ష ఉద్యమాలు వేడెక్కడం ఖాయమని అంటున్నారు. సీజేపీకి జంతర్ మంతర్ ఉద్యమం సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఉంది. విపక్షాలు ఎన్నో ఉద్యమాలను నిర్మించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన నైపుణ్యాన్ని కలిగి ఉన్నాయి. మరి ఈ విధంగా కొత్త సమీకరణలతో ముందుకు వస్తే అధికార ఎన్డీయే కూటమికి ఇది ఇబ్బందిగా ఉంటుందా అంటే వేచి చూడాల్సిందే. నవంబర్ 1న జరిగే ఇండియా కూటమి ర్యాలీలో పది లక్షల మందికి పైగా జనాలు పాల్గొంటారు అని అంటున్నారు. ఆ బిగ్ నంబర్ కనుక జత కూడితే చరిత్రలో నిలిచిపోయే అతి పెద్ద ఉద్యమమే అవుతుందని అంటున్నారు. దానితో పాటు సీజేపీ సహా జెన్ జీ యువత కూడా ఈ వైపున ఉవ్వెత్తున కదిలితే కాంగ్రెస్ సహా ఇండియా కూటమికి నూతన యవ్వనం వచ్చినట్లే అంటున్నారు. కుర్రాళ్ళ వేడి పెద్దల వాడితో ఎన్డీయేని కదిలిస్తారా అన్నది కూడా చర్చగా సాగుతోంది.

Tags:    

Similar News