ఏ2 గా ఎమ్మెల్సీ అనంత బాబు భార్య
కొన్నేళ్ళ క్రితం గోదావరి జిల్లాలనే కాదు యావత్తు ఏపీలోనే కలకలం రేపిన హత్య కేసు ఒకటి ఉంది నాటి వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు అది.;
కొన్నేళ్ళ క్రితం గోదావరి జిల్లాలనే కాదు యావత్తు ఏపీలోనే కలకలం రేపిన హత్య కేసు ఒకటి ఉంది నాటి వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు అది. ఈ కేసులో సుబ్రహ్మణ్యాన్ని హత్య ఘటనకు సంబంధించి ఏకంగా ఆయన ఇంటికే శవాన్ని కారులో తీసుకెళ్ళి అప్పగించారు అన్నది మరో సంచలనం. ఈ విధంగా ఈ హత్య కేసు ఎన్నో సంచలనాలను వేదిక అయింది. వైసీపీ అధికారంలో ఉన్న వేళ ఎమ్మెల్సీగా అనంత బాబు తన హవాని రంప చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో చలాయించేవారు అని విమర్శలు ప్రత్యర్ధులు గుప్పించారు. ఈ మీదట స్వయానా ఆయన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరగడం సైతం రాజకీయంగా తీవ్ర కలకలం రేపడమే కాదు వైసీపీకి కూడా గోదావరి జిల్లాలలో రాజకీయంగా ఇబ్బందిపడేలా చేసింది.
కొత్తగా చార్జిషీటు :
ఇక ఈ కేసుకు సంబంధించి చూస్తే అనంత బాబు ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్నారు. ఇపుడు కొత్తగా ఆయన భార్య మీద కూడా పోలీసులు చార్జిషీట్ నమోదు చేయడం విశేషం. ఆ విధంగా ఈ కేసులో కీలకమైన అడుగు పడింది అని అంటున్నారు. ఆమె ఈ హత్య కేసులో రెండో నిందితురాలు అని పోలీసులు చార్జి షీట్ దాఖలు చేయడం మీద చర్చ సాగుతోంది. తాజాగా రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టులో ఈ మేరకు పోలీసులు చార్జి షీట్ దాఖలు చేశారు. ఈ విధంగా ఎమ్మెల్సీ భార్యను ఈ కేసులో రెండో నిందితురాలిగా పేర్కొనడంతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది అని అంతా భావిస్తున్నారు.
ఆసలేమి జరిగిందంటే :
వైసీపీకి చెందిన అనంత బాబు తూర్పు గోదావరి జిల్లాలోని స్థానిక సంస్థల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. ఇక 2022 మే నెలలో ఆయన తన డ్రైవర్ వీధి సుబ్రమణ్యంను హత్య జరిగింది. ఈ కేసులో ఆయన ప్రమేయం ఉందని అనుమానం మీద ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు. ఆ మీదట ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ కోర్టు విధించింది. అంతే కాదు వీధి సుబ్రహ్మణ్యంకు ఎమ్మెల్సీకి సంబంధించిన కంపెనీలు ఇతర కార్యకలాపాల గురించి తెలుసని అందుకే తన మాజీ డ్రైవర్ ఈ రహస్యాలను బయటపెడతాడని ఆయన భయపడి, తనను చంపేస్తాడని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో వీధి సుబ్రహ్మణ్యం తీవ్ర గాయాల కారణంగా మరణించాడని ఇక అనంత బాబు అతన్ని ఆసుపత్రిలో చేర్చే ప్రయత్నం చేయడం ద్వారా హత్యను ప్రమాదంగా దాచిపెట్టడానికి ప్రయత్నించారని కూడా అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి. పెను సంచలనమే కాదు, రాజకీయ దుమారం రేపిన ఈ కేసులో ఇపుడు ఏ2గా ఎమ్మెల్సీ భార్యను చేర్చడంతో ఈ కేసులో మరెన్ని మలుపులు ఉన్నాయో అని అంతా చర్చించుకుంటున్నారు.