ఏకే-103 రైఫిల్స్‌ ..రష్యాతో భారత్‌ కీలక ఒప్పందం !

Update: 2021-08-21 08:45 GMT
భారత ప్రభుత్వం ఆయుధ రంగంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంది. ఇప్పటివరకు భారత ఆయుధ రంగంలో కనీవిని ఎరుగని రీతిలో కొత్త ఆయుధాలను తయారు చేసి భారత ఆర్మీకి అందుబాటులోకి అందిస్తుంది ఇక ఏకే 103 సిరీస్‌ రైఫిల్స్‌ ను రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేస్తోంది. దీనికి ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సైన్యం గడువు తిరిన, వాడుకలో లేని రైఫిళ్ల స్థానంలో ఈ కొత్త ఆయుధాలను కొనుగోలు చేయనుంది భారత్‌. కాగా, భారత్‌ అక్టోబర్‌ 2017లో భారత సైన్యం దాదాపు ఏడు లక్షల రైఫిల్స్‌, 44,000 రైట్‌ మెషిన్‌ గన్స్‌, దాదాపు 44,600 కార్బైన్లను కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించింది.

తాజాగా సైన్యానికి అందించడం కోసం భారత్, రష్యా ఒప్పందం కుదుర్చుకున్నాయి. రైఫిల్స్‌ తయారీ సంస్థ అయిన ఇండో, రష్యా రైఫిల్స్ ప్రయివేట్ లిమిటెడ్ కు చెందిన అధికారుల సమక్షంలో రక్షణ మంత్రిత్వ శాఖ, రష్యన్ ప్రతినిధుల మధ్య ఈ ఒప్పందం పై సంతకాలు జరిగాయి. ఈ రైఫిళ్ల ను ఈ ఏడాది నవంబర్ నుంచి సైనికులకు అందించనున్నారు. ప్రస్తుతం సైన్యం, నావికాదళం, వైమానిక దళంలో వినియోగిస్తున్న రైఫిల్స్ స్థానంలో వీటిని భర్తీ చేయనున్నారు. వీటిని ఫ్రంట్ లైన్ పదాతి దళ సైనికులు వినియోగిస్తారు. ఇందులో భాగంగా రష్యా నుంచి 70 వేల ఏకే-103 రైఫిల్స్‌ ను కొనుగోలు చేయబోతుంది.

రష్యాతో రక్షణ ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందం భారత్‌ కు కొంత ఇబ్బందిగా పరిణమించింది. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. దీనికి అమెరికా రూపంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అత్యాధునిక క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు సంబంధించి రష్యా, భారత్ మధ్య గతంలోనే ఒప్పందం కుదిరింది. అయితే, రష్యా నుంచి ప్రధాన రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే సీఏఏటీఎస్ కింద ఆంక్షలు విధిస్తామని భాగస్వామ్య దేశాలకు అమెరికాకొన్ని రోజుల ముందు హెచ్చరికలు పంపింది. రష్యా అభివృద్ధి చేసిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థకు మేము వ్యతిరేకం, వీటిని భారత్ కొనుగోలు చేస్తే, ఆంక్షలు విధించే అవకాశం ఉంది.. అమెరికా ఆంక్షల చట్టానికి భారత్- రష్యా ఒప్పందం వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణం అని సీఆర్ ఎస్ వెల్లడించింది.

వాస్తవానికి ఈ క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు సంబంధించి 2018లో ఐదు బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం భారత్, రష్యా మధ్య కుదిరింది. ఇందుకు అడ్వాన్స్ కింద 800 మిలియన్ డాలర్లు చెల్లించింది. ఆ సమయంలో ట్రంప్ ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా, భారత్ వెనక్కు తగ్గలేదు. పొరుగు దేశాల నుంచి తమకు ఉన్న ముప్పు నేపథ్యంలో వీటి కొనుగోలు తప్పనిసరని స్పష్టం చేసింది. ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ఎస్‌-400ని కొనుగోలు చేసే హ‌క్కు భార‌త్‌ కు ఉంద‌ని ఉద్ఘాటించింది. అమెరికాకు చెందిన ఇదే తరహా మిసైల్స్ థాడ్, పేట్రియాట్‌ లతో పోలిస్తే ఎస్-400 సామర్ధ్యం ఎక్కువ. ఈ రెండు రకాల వ్యవస్థలను భారత్‌కు విక్రయించాలని అమెరికా గతంలో ప్రయత్నించగా, కేంద్రం మాత్రం రష్యా వైపు మొగ్గు చూపింది. శత్రువుల యుద్ధ విమానాలతో పాటు డ్రోన్‌ లు, క్షిపణులను కూల్చివేయగల సత్తా దీని సొంతం. గగనతలంలో విమానాలు 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నా, 400 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి కూల్చివేయగలదు. ఒకే సమయంలో 30 వరకూ విమానాలు, యూఏవీలు, క్షిపణులను ఎదుర్కొనే సామర్ధ్యంతో దీనిని రూపొందించారు.


Tags:    

Similar News