డిజిట‌ల్‌ లో భార‌తీయులే ముందంజ‌..తేల్చిచెప్పిన ఓ స‌ర్వే

Update: 2020-04-17 17:00 GMT
ప్రపంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశం మ‌న‌ది. ఈ దేశం వెన‌క‌బ‌డింద‌ని కొంద‌రు చెబుతున్నారు. కానీ సాంకేతిక ప‌రిజ్ఞానంలో మాత్రం మెరుగ్గా ఉంది. ఇత‌ర దేశాల క‌న్నా అత్య‌ధికంగా భార‌త్‌ లోనే సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగిస్తున్నారు. తాజాగా డిజిటల్ సామర్ధ్యాలు వినియోగించుకోవడంలో కూడా భారత‌దేశం ముందంజ‌లో ఉంది. ఈ విష‌యాన్ని ఓ సర్వేలో వెల్లడైంది. పని ప్రదేశాల్లో కొత్త సాంకేతికతలు నేర్చుకోవడంలో భార‌తీయులు ముందుంటున్నట్లు ఆ స‌ర్వే స్పష్టం చేస్తోంది.

మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), కృత్రిమ మేధ (ఏఐ) - ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) వంటి సరికొత్త సాంకేతికతలు తమ పని సాఫల్యతను పెంచుతున్నాయని భారత్‌ లోని 67 శాతం మంది డిజిటల్ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నట్లు ‘గార్ట్‌ నర్ 2019 డిజిటల్ వర్క్‌ ప్లేస్‌’ సర్వే పేర్కొంది. ఇత‌ర దేశాల‌తో పాటు భార‌తదేశంలో కూడా ఆ సామ‌ర్థ్యాలు విస్తృతంగా వినియోగిస్తున్న‌ట్లు చెప్పారు. చైనా - ఫ్రాన్స్ - జర్మనీ - అమెరికా - యూకే (లండ‌న్‌)లతో పోలిస్తే సింగపూర్ - భారత్‌ లోని ఉద్యోగులు సామాజిక మాధ్యమాలు - రియల్ టైం మేనేజింగ్ యాప్‌ లను అధికంగా ఉపయోగిస్తున్నట్లు ఆ స‌ర్వేలో తేలింద‌ని గార్ట్‌నర్ రీసెర్చర్ రష్మీ చౌదరి ప్ర‌క‌టించారు.

ఉద్యోగుల మధ్య సహకారం పెరిగి డిజిటల్ సామర్థ్యాలు మెరుగుపడేలా దోహ‌దం చేస్తున్నాయ‌ని వివ‌రించారు. కొత్త సాంకేతికతను నేర్చుకోవడంతో భారత‌దేశంలోని ప్ర‌తి 10 మందిలో ఏడుగురు ఉద్యోగులు కెరీర్‌ పరంగా ఉన్నత అవకాశాలు - మంచి వేత‌నం పొందుతున్నారని వెల్ల‌డించారు. వీటితో ఉద్యోగంలో భాగంగా త‌మ పనిలో కూడా సాంకేతికత‌ను వినియోగించుకుని నైపుణ్యం పెంపొందించుకుంటున్నార‌ని,  27 శాతం మంది ఉద్యోగులు విశిష్ట నైపుణ్యం కనబరుస్తున్నట్లు స‌ర్వేలో వెల్ల‌డైంది. ఏఐ - ఎంఎల్ - ఓటీ వంటి సాంకేతికతల్లో ఎప్పటికప్పుడు అప్‌ డేట్ అయ్యేందుకు 39 శాతం మంది ఉద్యోగులు ఓటీజే శిక్షణ కోరుకుంటున్నారని తేలింది. తమ ప‌ని అలవాట్లను డిజిటల్ సాంకేతికతల తో పసి గట్టినా అభ్యంతరం లేదని 45 శాతం మంది ఉద్యోగులు స్పష్టం చేశారు. క్లాస్‌ రూంలతో కూడిన ఆన్‌ ద జాబ్ ట్రైనింగ్ - జస్ట్ ఇన్ టైం వంటి విధానాలతో డిజిటల్ నైపుణ్యాలను మెరుగు పర్చుకోవడానికి మ‌రికొంత‌మంది ఉద్యోగులు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఈ విధంగా భార‌తీయులు సాంకేతిక సామ‌ర్థాల్య‌ను పెంపొందించుకునేందుకు ఇంట్ర‌స్ట్‌ గా ఉన్నారు.
Tags:    

Similar News