భారత్ ఇప్పుడు పెట్టుబడులకు స్వర్గధామం..! ఇదంతా మా వల్లే..!
ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వల్ల భారత్ పెట్టుబడులకు స్వర్గదామంగా మారిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాలం చెల్లిన పాత చట్టాలను ఏన్డీఏ సర్కార్ సంస్కరించిందని చెప్పారు. అందువల్లే ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్లు అందరూ మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు. కరోనా సంక్షోభంలోనూ మనదేశానికి పెట్టుబడులు వచ్చాయంటే అందుకు కారణం ఇక్కడ చట్టాల్లో వచ్చిన సంస్కరణమే కారణం.
మనదేశం పెట్టుబడులకు స్వర్గధామం. ఇక్కడ మానవవనరులు, సహజవనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలలో మార్పులు జరగాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. అసోచామ్ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గడిచిన ఆరేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని ఆయన అన్నారు.
ప్రపంచ పెట్టుబడుదారులకు ఇప్పుడు భారత్ ఎంతో అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు. ‘ప్రస్తుతం మనదేశం స్వావలంబన దిశగా పయనిస్తోంది.
పరిశ్రమల స్థాపనకు ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి. అనుమతులు కూడా ఎంతో తెలికగా వస్తాయి. ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తుంది. అందుకే పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచస్థాయి కంపెనీలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తయారీలో కూడా మనదేశం ఎంతో ముందుంది. అయితే మనదేశంలో ఇంకా పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉంది. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెరగాలి. మనదేశానికి అవసరమైన వస్తువులన్నీ ఇక్కడే తయారుచేసుకోవాలి. మేకిన్ ఇండియా లక్ష్యం ఇదే. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మన ఉత్పత్తులకు గిరాకీ పెరగాలి. అప్పుడే దేశ ఆర్థికపురోగతి సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అన్ని వసతులు కల్పిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం లేకుండా చేయడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.