మహమ్మారిపై భారత్ విజయం.. ఇదే సాక్ష్యం
దేశంలో లాక్ డౌన్ ను దాదాపు సడలింపులతో కేంద్రం ఎత్తేసినట్టే. ఇన్నాళ్లు కేంద్రం విధించిన లాక్ డౌన్ వల్ల మరీ ఏం ఉపయోగం కలిగింది. అది లాభం చేసిందా? నష్టం చేసిందా? ప్రపంవ్యాప్తంగా మహమ్మారి విస్తృతితో పోలిస్తే భారత్ లో తగ్గిందా? పెరిగిందా? విదేశాలకు భారత్ కు మధ్య తేడా ఏంటి? అన్న దానిపై కేంద్రం సవివరంగా ఒక నివేదికను తాజాగా బయటపెట్టింది. ప్రస్తుత గణాంకాలు పోల్చి చూస్తే నిజంగా భారతదేశం కరోనాపై పోరులో విజయవంతమైందనే చెప్పవచ్చు. 50 రోజుల లాక్డౌన్ వైరస్ వ్యాప్తి వేగాన్ని తగ్గించడంలో సహాయపడింది. మహమ్మారిని వ్యాప్తిని అరికట్టడానికి.. తిరిగి పునరుత్తేజం కావడానికి వైరస్ కు వ్యతిరేకంగా నిజమైన పోరాటానికి సిద్ధం చేయడానికి ప్రభుత్వానికి ఈ లాక్ డౌన్ సమయం చాలా కీలకమని గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు ‘‘కేంద్ర మెడికల్ ఎడ్యూకేషన్, డ్రగ్ డిపార్ట్ మెంట్ ’’ విడుదల చేసిన గణంకాల ద్వారా మహ్మారి విషయంలో భారత్ మిగతా దేశాల కంటే ఎంత బాగా పనిచేసిందనేది తేటతెల్లమవుతోంది.
లాక్ డౌన్ వల్లనే దేశంలో కేసుల సంఖ్య చాలా వరకు తగ్గింది. భారత్ లో కరోనా కేసులు మొదలయ్యాక డబుల్ అయ్యింది ఏప్రిల్ తొలివారం నుంచే.. అప్పటినుంచే మోస్తారుగా భారీగా పెరగడం మొదలైంది. ఏప్రిల్ రెండో వారం నుంచి కేసుల సంఖ్య డబుల్ కావడం.. అమాంతంగా పెరిగినట్టు గ్రాఫ్ సూచిస్తోంది.
ఈరోజు నాటికి.. ప్రపంచవ్యాప్తంగా నేటి 46.18 లక్షల కేసులు నమోదయ్యాయి. అదే భారత్ లో 101139 కేసులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ పుట్టినప్పటి నుంచి విస్తరించిన వరకు సగటు విస్తరణ చూస్తే కేసుల పెరుగుదల 6.75శాతం పెరగగా.. భారత్ లో మాత్రం 3.13శాతం మాత్రమే పెరిగింది. మరణాల రేటు కూడా భారీగా తక్కువగా ఉందని కేంద్రం తెలిపింది.
కరోనా వ్యాప్తిని భారత్ లాక్ డౌన్ తో చాలా వరకు కట్టడి చేసింది. మొదటి 25,000 పాజిటివ్ కేసుల మార్క్ రావడానికి భారత్ లో 86 రోజులు పట్టింది. 25,000 నుంచి 50,000 కేసులను చేరుకోవడానికి 11 రోజులు పట్టింది. 75000 చేరుకోవడానికి మరో 7 రోజులు పట్టింది. ఇప్పుడు 1 లక్ష మార్కును చేరుకోవడానికి కేవలం ఐదు రోజులు పట్టడం గమనార్హం.
కానీ పాజిటివ్ కేసుల వృద్ధి రేటు 7.6 నుండి 7.0 కి, తరువాత 5.7 నుండి 5.1 శాతానికి పడిపోయింది. లాక్డౌన్ కారణంగా దీని తీవ్రత తగ్గిందని కేంద్రం నివేదిక చెబుతోంది. కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి తీసుకున్న సమయం దేశంలో 12 రోజులకు పెరిగింది.
దేశంలోనే అత్యధిక తీవ్రత మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడుల్లో ఉన్నట్టు కేంద్రం తెలిపింది. ఈ వైరస్ వ్యాప్తి నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలను.. ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు జార్ఖండ్లను ఈ మహమ్మారి వ్యాప్తి నుండి భారత్ రక్షించగలిగింది. ప్రస్తుతం దేశంలో కేవలం నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితి భయంకరంగా ఉంది. మహారాష్ట్రలో 39 శాతం కేసులు, తమిళనాడు (13.7 శాతం), గుజరాత్ (11 శాతం), ఢిల్లీ (10.4 శాతం) కేసులు ఉన్నాయి.
భారత దేశంలో లక్ష మార్కును చేరుకోవడానికి 109 రోజులు పట్టింది. ఈ విధంగా, భారతదేశంలో లక్ష కేసులు పట్టడానికి రోజులతో పోలిస్తే కేవలం మన సగటు కేవలం 6శాతం మాత్రమే ఉండగా, ప్రపంచ సగటు 60శాతంగా ఉంది. నిజానికి ప్రపంచ సగటుతో కనుక భారత్ లో వైరస్ విస్తరిస్తే మే నాటికి 33 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదై ఉండేవి. దీంతో దేశంలో హాహాకారాలు.. అల్లకల్లోలు.. కోట్ల మంది ప్రాణాలకు ముప్పు ఉండేది. కానీ నిజంగా మోడీ సర్కార్ సకాలంలో విధించిన లాక్‌డౌన్ సహాయపడిందని చెప్పవచ్చు.