అంచ‌నాల‌ను మించి లోకేష్ పొలిటిక‌ల్ న‌యా స్ట్రాట‌జీ.. !

ఇప్పుడు ఇటు యువ నేత‌ల‌ను, అటు సీనియ‌ర్ల‌ను కూడా స‌మానంగా క‌లుస్తున్నారు. నిజానికి ఏదైనా వే దిక‌పై సీనియ‌ర్లు ఉంటే.. వారికి పాద‌న‌మ‌స్కారాలు చేస్తున్నారు.;

Update: 2026-02-19 14:30 GMT

ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స‌రికొత్త వ్యూహంతో రాజ‌కీయాలు చేస్తున్నారా ? .. చాలా ఆలోచించి.. అడుగులు వేస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. గ‌తంలో యువ నేత‌గా ఉన్న ఆయ‌న‌.. కేవ‌లం పార్టీ యువ నాయ‌కుల‌కు మాత్ర‌మే అప్పాయింట్‌మెంటు ఇచ్చేవారు.. వారితోనే ఎక్కువ‌గా సంభాషించేవారు. పార్టీ కార్య‌క్ర‌మాల నుంచి భ‌విష్య‌త్తు కార్య‌క్ర‌మాల వ‌ర‌కు యువ‌త ను టార్గెట్ చేసుకుని రూపొందించారు.

ఇక‌, సీనియ‌ర్ల వ్య‌వ‌హారం జోలికి నారా లోకేష్ గ‌తంలో ఎప్పుడూ పోలేదు. దీంతో లోకేష్‌కు.. పార్టీలో ఉన్న సీనియ‌ర్ల‌కు మ‌ధ్య చాలా గ్యాప్ పెరిగింద‌న్న‌ది వాస్త‌వం. ఇది.. ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేసే స్థాయికి కూడా వెళ్లిపోయింది. గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు వంటివారు.. నారా లోకేష్‌ను అప్ప‌ట్లో ప‌రోక్షంగా.. ప్ర‌త్య‌క్షంగా కూడా విమ‌ర్శించారు. ఇది గ‌త ఐదేళ్ల‌లో లోకేష్‌కు ఇబ్బంది క‌లిగించింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తన పొలిటిక‌ల్ వ్యూహాన్ని మార్చుకున్నారు.

ఇప్పుడు ఇటు యువ నేత‌ల‌ను, అటు సీనియ‌ర్ల‌ను కూడా స‌మానంగా క‌లుస్తున్నారు. నిజానికి ఏదైనా వేదిక‌పై సీనియ‌ర్లు ఉంటే.. వారికి పాద‌న‌మ‌స్కారాలు చేస్తున్నారు. ఆత్మీయ ఆలింగ‌నాలు కూడా చేసుకుం టున్నారు. ఇక‌, ఆ త‌ర్వాతే యువ నేత‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏదైనా స‌మ‌స్య‌ల‌పై సీనియ‌ర్లు త‌న ను క‌లిసేందుకు వ‌స్తే.. ఒక్క క్ష‌ణం కూడా వెయిట్ చేయించ‌కుండా.. వారిని క‌లుస్తున్నారు. కొన్ని సంద ర్భాల్లో త‌నే స్వ‌యంగా లేచి వెళ్లి.. వారిని ప‌ల‌క‌రిస్తున్నారు.

ఇలా.. భ‌విష్య‌త్తు ను దృష్టిలో పెట్టుకుని పార్టీలో కీల‌క నాయ‌కుడిగా నారా లోకేష్ ఎదుగుతున్నారు. ఇదొ క్క‌టే కాదు.. పార్టీ నేత‌గా.. ఆయ‌న త‌న‌ను తాను ఎప్ప‌టిక‌ప్పుడు తీర్చిదిద్దుకుంటున్నారు. ఎక్క‌డ త‌గ్గాలో.. ఎక్కడ నెగ్గాలో కూడా.. తెలుసుకుని దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో త‌న భాష‌ను మ‌రింత ప‌దును పెంచుకుంటున్నారు. అలాగే బాడీ లాంగ్వేజ్‌లోనూ మార్పులు చేసుకుంటున్నా రు. మొత్తంగా.. పార్టీలో భ‌విష్య‌త్తులో కీల‌క నాయ‌కుడిగా మార‌నున్న నేప‌థ్యంలో అన్ని వ‌ర్గాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునే వ్యూహాత్మ‌క శైలిని ఆయ‌న అందిపుచ్చుకుంటున్నారు.

Tags:    

Similar News