పొలిటికల్ డిబేట్: షర్మిల కష్టం.. ఫలించేనా ..!
కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా ఉన్న వైఎస్ షర్మిల.. గత ఎన్నికల నుంచి కష్టపడుతున్న విషయం తెలిసిందే.;
కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా ఉన్న వైఎస్ షర్మిల.. గత ఎన్నికల నుంచి కష్టపడుతున్న విషయం తెలిసిందే. దీనిలో కొంత సొంత పాళ్లు.. మరికొంత పార్టీ పాళ్లు ఉన్నప్పటికీ.. ఆమె కష్టపడుతున్నారన్నది వాస్తవం. సమయానికి తగు మాటలాడినట్టుగా.. సమయం చూసుకుని.. సందర్భం వెతుక్కుని షర్మిల రాజకీయాలు చేస్తున్నారన్న వాదన ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా చూస్తే.. షర్మిల ఏమీ లేని కొమ్మను పట్టుకుని.. చిగురిం చే ప్రయత్నం చేస్తున్నారు.
2024, ఫిబ్రవరిలో పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిలకు.. ఏపీలో కాంగ్రెస్ ఏ పరిస్థితిలో ఉందో తెలుసు. అయిన ప్పటికీ.. ఆమె ఎందుకు బాధ్యతలు తీసుకున్నారంటే.. రాజకీయంగా ఆమె ఉన్న చిరు కోరిక తీరుతుంద న్న ఆశతోనేనని పరిశీలకులు అంటుంటారు. అదే రాజ్యసభకు వెళ్లడం. గతంలోనూ 2019లో వైసీపీ విజయం దక్కించుకున్నప్పుడు.. షర్మిల రాజ్యసభ టికెట్ కోరుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. ఒకే కుటుంబంలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయన్న ఉద్దేశంతో జగన్ ఆమెను పక్కన పెట్టారు.
ఇక, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా.. కోదా.. అనే విషయం పక్కన పెట్టి.. ఆ పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్న షర్మిల.. గత ఎన్నికల్లో ప్రయాస పడ్డారు. కనీసంలో కనీసం 2 శాతం ఓటు బ్యాంకుకు అయినా.. పార్టీని ముందుకు నడిపించాలని అనుకున్నారు. కానీ, సాధ్యంకాలేదు. అయినా.. శ్రమిస్తూనే ఉన్నారు. ఇక, ఇప్పుడు ఈ శ్రమకు ఫలితం దక్కుతుందా? అనే చర్చ తెరమీదికి వచ్చింది. పార్టీ పగ్గాలు ఇచ్చి నప్పుడు.. షర్మిల తన మనసులో మాటను పార్టీ ముందు పెట్టారు.
తనకు రాజ్యసభ సీటు కావాలని ఆమె ఆకాంక్షించారు. దీనికి పార్టీ కూడా ఓకే చెప్పింది. ఇక, ఇప్పుడు తాజాగా 37 సీట్లు ఖాళీ అవుతున్నాయి. షెడ్యూల్ కూడా విడుదల అయింది. ఈ నేపథ్యంలో షర్మిలకు ఒక్కసీటు దక్కుతుందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. తెలంగాణలో రెండు సీట్ల కోసం 20 మంది బరిలో ఉన్నారు. కర్ణాటకలో ఒకసీటు ఖాళీ అవుతున్నా..అది మళ్లీ ఏఐసీసీ చీఫ్ ఖర్గేకే దక్కనుంది. ఇక, ఎటొచ్చీ.. తమిళనాడు కోటాలో ఖాళీ అవుతున్న ఆరు స్థానాలలో ఒకటి కాంగ్రెస్‌కు దక్కితే.. దానినైనా షర్మిలకు ఇస్తారో లేదో చూడాలి. ఏదేమైనా షర్మిల కష్టం ఫలించాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు.