• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  NRI >  టెక్సాస్‌లో దారుణం:...

టెక్సాస్‌లో దారుణం: కన్నవారిని, అమ్మమ్మను కాల్చిచంపిన భారతీయ యువకుడు..

| అమెరికాలో నివసిస్తున్న భారతీయ కుటుంబంలో ఊహించని ఘోర కలి వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవారినే ఓ కుమారుడు అత్యంత కిరాతకంగా కాల్చిచంపాడు.

By - A.N.Kumar
Update: 2026-06-20 15:11 GMT

అమెరికాలో నివసిస్తున్న భారతీయ కుటుంబంలో ఊహించని ఘోర కలి వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవారినే ఓ కుమారుడు అత్యంత కిరాతకంగా కాల్చిచంపాడు. టెక్సాస్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన స్థానిక ప్రవాస భారతీయ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురిచేసింది. 19 ఏళ్ల భారతీయ యువకుడు గౌరవ్ చోప్రా తన సొంత తండ్రి, తల్లి, అమ్మమ్మను తుపాకీతో కాల్చి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. టెక్సాస్‌లోని ఆల్టన్ ప్రాంతంలో జరిగిన ఈ విషాదకర సంఘటన కలిచివేసింది.

ఒకే ఇంట్లో మూడు శవాలు.. అసలేం జరిగింది?

పోలీసులు వెల్లడించిన ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం.. నిందితుడు గౌరవ్ చోప్రా తన నివాసంలోనే కుటుంబ సభ్యులతో తీవ్ర ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా విచక్షణారహితంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘోర కాల్పుల్లో అతని తండ్రి, తల్లి, అలాగే వృద్ధురాలైన అమ్మమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిమిషాల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించడంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. ఘటన అనంతరం నిందితుడు గౌరవ్ అక్కడి నుంచి పరారయ్యాడు.

అన్న చాకచక్యం.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

ఈ భీకర దాడి సమయంలో ఇంట్లోనే ఉన్న గౌరవ్ 21 ఏళ్ల అన్న తృటిలో ప్రాణాలతో బయటపడటం గమనార్హం. టెక్సాస్‌లోని హిడాల్గో కౌంటీ షెరీఫ్ ఎడ్డి గెర్రా తెలిపిన వివరాల ప్రకారం.. తమ్ముడు గౌరవ్ కన్నవారిపై కాల్పులు జరపడం చూసిన అన్న భయాందోళనకు గురయ్యాడు. గౌరవ్ అతనిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించగా అతను చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకుని 911 అత్యవసర నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. తన తమ్ముడు కుటుంబ సభ్యులందరినీ కాల్చిచంపాడని.. తనను కూడా చంపేందుకు ప్రయత్నించాడని ఆర్తనాదాలు చేస్తూ పోలీసులకు వివరించాడు.

రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు అరెస్ట్

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీ బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇల్లంతా పరిశీలించి మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరారీలో ఉన్న నిందితుడు గౌరవ్ చోప్రా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హత్యకు గల కారణాలపై వీడని మిస్టరీ

అయితే ఇంతటి ఘోరానికి ఒడిగట్టడానికి గల అసలు కారణం ఏమిటన్నది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే మారింది. దర్యాప్తు అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఆ కుటుంబానికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. ఇంట్లో గృహహింస జరిగినట్లుగానీ ఎలాంటి గొడవలు ఉన్నట్లుగానీ పోలీసు రికార్డుల్లో లేదు. గతంలో ఎలాంటి పోలీసు ఫిర్యాదులు కూడా నమోదు కాలేదు. సమాజంలో ఎంతో మర్యాదగా ఉండే కుటుంబంలో ఇలాంటి ఘోరం జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హత్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. "ఈ ఘటన వెనుక తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలున్నాయా? లేదా ఎవరికీ తెలియని అంతర్గత కుటుంబ విభేదాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నాం. పూర్తి దర్యాప్తు ముగిసే వరకు ఒక స్పష్టతకు రాలేము" అని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.

ప్రవాస భారతీయ సమాజంలో ఆందోళన

ఇటీవలి కాలంలో అమెరికాలో భారతీయులకు సంబంధించిన విషాదకర సంఘటనలు, ఘర్షణలు, అనుమానాస్పద మరణాలు వరుసగా వెలుగుచూస్తుండటం ఎన్నారైలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువత ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఉన్న కారణాలపై చర్చలు మొదలయ్యాయి. కన్నవారిని, వృద్ధులను కూడా చూడకుండా ఒక యువకుడు ఇంతటి క్రూరత్వానికి పాల్పడ్డాడనే వార్త అమెరికాలోని భారతీయ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Tags:    
  • dallas 
  • texas 
  • usacrime 
  • indiancommunity 
  • tragedy 
  • indianinusa 

Similar News

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

70 మంది బాలికలను ట్రాప్ చేసిన భారతీయ విద్యార్థి.. బ్రిటన్‌లో 30 ఏళ్ల జైలు శిక్ష!

2026-11-14 11:30 GMT

23 ఏళ్లకే రూ.37 వేల కోట్ల సంపద.. ఏఐతో భారత సంతతి యువకుల సంచలనం!

2026-11-13 17:30 GMT

H-1B వీసాదారులకు కొత్త టెన్షన్.. రెన్యూవల్ నిబంధనల్లో మార్పులకు అమెరికా సిద్ధం!

2026-11-13 16:47 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

విదేశాల్లో భారతీయుల ప్రవర్తనపై విమర్శలు.. అసలు సమస్య ఎక్కడుంది?

2026-11-09 16:30 GMT

అమెరికాలో 22 ఏళ్ల తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి

2026-11-08 13:35 GMT

గచ్చిబౌలి హోటల్‌లో అమెరికా వ్యాపారవేత్త మృతి

2026-11-07 04:00 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

Copyright @2026

Powered by Blink CMS