చైనాకు భారత్ ఇస్తున్న షాక్ ఎంతో చెప్పిన బ్లూమ్ బర్గ్
చైనాలొ చోటు చేసుకున్న పరిణామాలు.. ముఖ్యంగా కరోనా ఎపిసోడ్ తర్వాత ఆ దేశం అంతర్జాతీయంగా ఒంటరైన పరిస్థితి. దీనికి తోడు.. డ్రాగన్ దేశపు దరిద్రపుగొట్టు తీరుతో భారత్ తో పెట్టుకున్న పంచాయితీకి ఆ దేశం తగిన మూల్యాన్ని చెల్లిస్తోంది. చైనా నుంచి బయటకు వెళ్లిపోతున్న కంపెనీలను భారత్ ఆకర్షిస్తోంది. అదెంత స్థాయిలో ఉందన్న విషయంపై తాజాగా బ్లూమ్ బర్గ్ తన నివేదికలో వెల్లడించింది. తాజాగా చైనాలోని 24 కంపెనీలు భారత్ లో తమ సంస్థల్ని నెలకొల్పేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు.
ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో దిగ్గజాలుగా పేరొందిన ఆపిల్.. శాంసంగ్ లాంటి సంస్థల అసెంబ్లింగ్ యూనిట్లు చైనా నుంచి భారత్ కు వచ్చేందుకు ఇష్టపడుతున్నాయి. మొబైల్ ఫోన్ కర్మాగారాల ఏర్పాట్ల నిమిత్తం ఆ సంస్థలు భారత్ లో దాదాపు రూ.11,217 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లుగా తాజా రిపోర్టు స్పష్టం చేస్తోంది.
అంతర్జాతీయంగా అమెరికా - చైనా మధ్య ముదిరిన వాణిజ్య పోరుతో పాటు ఇతర అంశాల నేపథ్యంలో డ్రాగన్ దేశంలో కర్మాగారాలున్న కంపెనీలు భారత్ తో పాటు పలు దేశాల వైపు చూస్తున్నాయి. ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం ఆపిల్.. తన విడిభాగాల సరఫరా అసెంబ్లీ యూనిట్ చెన్నైలో ఉంది. రానున్న మూడేళ్లలో దాదాపు రూ.7.4వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చెబుతున్నారు.
వాస్తవానికి చైనా నుంచి బయటకు వచ్చేస్తున్న కంపెనీల్ని ఆకర్షించటంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ వెనకపడినట్లేనని చెబుతున్నారు. ఎందుకంటే..ఆయా కంపెనీల్ని ఆకర్షించటంలో వియత్నాం.. కంబోడియా.. మయన్మార్.. బంగ్లాదేశ్.. థాయిలాండ్ తదితర దేశాలు భారత్ కంటే చాలా యాక్టివ్ గా ఉన్నాయని చెబుతున్నారు. అయినప్పటికి భారత్ లో చైనా నుంచి వచ్చేసే కంపెనీల కారణంగా దేశంలో దాదాపు పది లక్షలకు పైగా కొత్త ఉద్యోగులు రానున్నట్లు చెబుతున్నారు. చైనా నుంచి వచ్చే దేశాల్ని ఆకర్షించే విషయంలో భారత్ తీరు బాగున్నా.. ఇప్పుడున్న అవకాశాలతో పోల్చినప్పుడు మరిన్ని అవకాశాల్ని సొంతం చేసుకునే వీలుంది.