సిరాజ్​ భాయ్​.. దావత్​ ఎప్పుడు?

Update: 2021-01-24 02:30 GMT
టీం ఇండియా ఫాస్ట్​బౌలర్​, హైదరాబాద్​ కుర్రాడు సిరాజ్(26)​ కొత్త బీఎండబ్ల్యూ కారు కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సిరాజ్​ ఇటీవల ఇన్​స్టా అకౌంట్​లో పోస్ట్​చేశాడు. అయితే ఆ కారు చాలా రీసెంట్​గా కొనుగోలు చేసినట్టు ఉన్నాడు. ఇంకా టెంపరరీ నంబర్​ ప్లేట్​తో ఉంది. అయితే సిరాజ్​ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో మెరుగైన బౌలింగ్​ ప్రదర్శన ఇచ్చిన విషయం తెలిసిందే.

సిరాజ్​ ఆసీస్​ టూర్​లో ఉన్నప్పుడే అతడి తండ్రి చనిపోయాడు. కానీ టీం ఇండియాకు ఆడాలన్న తండ్రి ఆకాంక్షతో అతడు ఆస్ట్రేలియాలో ఉండిపోయాడు. తండ్రి కోరికమేరకు టీం ఇండియా తరఫున క్రికెట్​ ఆడాడు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు వచ్చిన వెంబడే తనతండ్రి సమాధిని దర్శించుకున్నాడు సిరాజ్​. 

మహ్మద్​ షమీకి గాయం కావడంతో సిరాజ్​కు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సిరాజ్​ సద్వినియోగం చేసుకున్నాడు. 
ఆస్ట్రేలియా సిరీస్​లో మొత్తం 13 వికెట్లతో పడగొట్టాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి .. టీం ఇండియా జట్టు విజయంలో తోడ్పడ్డాడు. అయితే సిరాజ్​పై కొందరు ఆస్ట్రేలియా బౌలర్లు జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అయినప్పటికీ సిరాజ్​ స్థిరంగా ఆడాడు. ప్రస్తుతం సిరాజ్​ ఖరీదైన కారు కొనుగోలు చేయడం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.అయితే ‘సిరాజ్​ భాయ్​ దావత్​ ఎప్పుడు’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Tags:    

Similar News