పులులు పెరిగిపోతున్నాయంట

Update: 2015-01-20 22:30 GMT
నిన్నమొన్నటి వరకూ గణనీయంగా పడిపోతున్న పులుల సంఖ్య ఉన్నట్లుండి పెరగటం మొదలైంది. ఈ ఆసక్తికర అంశం తాజాగా బయటకు వచ్చింది. మారిన పరిస్థితుల  నేపథ్యంలో పులుల సంఖ్య భారీగా తగ్గిపోవటం మొదలైంది. దీంతో.. పులులను కాపాడేందుకు.. వాటి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఆ ప్రయత్నాలు ఫలించినట్లు తాజాగా కేంద్ర పర్యావరణ శాఖ ప్రకటించింది. ప్రపంచంలో 70 శాతం పులులు ఇండియాలోనే ఉన్నాయి. ఇక.. రాష్ట్రాల వారీగా ఉన్న పులల సంఖ్య చూస్తే.. కర్ణాటకలో అత్యధికంగా 406 పులులు ఉన్నాయని.. ఉత్తరాఖండ్‌లో 340.. తమిళనాడులో 229  ఉన్నట్లు తేల్చారు.

ఇక.. మధ్య ప్రదేశ్‌లో 208.. మహారాష్ట్రలో 190 పులులు ఉన్నాయని చెప్పారు. మొత్తంగా చూస్తే ఏడేళ్ల క్రితం దేశంలో ఉన్న 1400 పులుల స్థానంలో 2014 నాటికి వాటి సంఖ్య పెరిగి.. 2226గా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తానికి.. పులుల సంఖ్య పెంచటంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లే.. ఇలానే.. దేశంలో పేదరికం తగ్గించేందుకు ప్రయత్నిస్తే బాగుంటుంది కదా.

Tags:    

Similar News