బ్రేకింగ్ న్యూస్ : టాప్ 10 లోకి దూసుకెళ్లిన ఇండియా ..

Update: 2020-05-25 07:30 GMT
తొలివిడత లాక్‌ డౌన్ సమయంలో  కరోనా వ్యాప్తి పూర్తి నియంత్రణలో ఉండగా, నాలుగో విడత లాక్ ‌డౌన్ సడలింపులు అమలవుతున్న ప్రస్తుత సమయంలో వైరస్ వ్యాప్తి చేయిదాటిపోయింది అని పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.వైరస్ పాజిటివ్ కేసుల్లో ఇండియా టాప్ 10 లోకి చేరింది. అలాగే  ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక రోజూ  6 వేలకు పైగా కొత్త  కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా మరో 6,767 కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య  లక్షా 32 వేలకు చేరువైంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్ధితి మరింత డేంజర్ గా తయారైంది.

కేవలం 72 గంటల్లో దేశంలో 20,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి 20,000 కేసులు నమోదు కావడానికి 90 రోజుల సమయం పడితే ఇప్పుడు కేవలం మూడంటే మూడు రోజుల్లో అంతే సంఖ్యలో కొత్త కేసులు లెక్కతేలాయి. దేశవ్యాప్తంగా లక్షా 32 వేలకు పైగా కేసులు నమోదు కాగా మహమ్మారి బారిన పడి 3,800 మందికి పైగా  మృతి చెందారు. అలాగే , ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు సుమారు 74,000 ఉండగా., 55,000 మంది డిశ్చార్జ్ అయ్యారు.

 ఇక ప్రపంచ వ్యాప్తంగా 16 .86  లక్షల కేసులు  , 99330 మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా ..ఆ తర్వాత బ్రెజిల్ , రష్యా , స్పెయిన్ , uk , ఇటలీ , ఫ్రాన్స్ , జర్మనీ , టర్కి  ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 54 . 98 లక్షల కేసులు .. 3 . 46 లక్షల మంది మరణించారు. మరోవైపు భారత్‌లో వైరస్ వ్యాక్సిన్ ప్రయోగాలు వేగవంతమయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో అభివృద్ధి చేస్తున్న 14 వ్యాక్సిన్లలో 4 టీకాలు అతి త్వరలో క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకుంటాయని వివరించింది.  ఐదు నెలల్లో భారత్‌లో నాలుగు  వ్యాక్సిన్లు కీలక దశకు చేరుకుంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది. ఏదేమైనా ఈ మహమ్మారికి సరైన మందు రావాలంటే మరో ఏడాది సమయం పట్టేలా ఉంది. కాబట్టి , అప్పటి వరకు  అందరూ జాగ్రత్తలు పాటించాల్సిందే.


Tags:    

Similar News