ఇదే.. భారత్.. చైనా ఆర్మీ బలాల లెక్క
భారత్.. చైనాల మధ్య తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భూటాన్ సరిహద్దుల విషయంలో నెలకొన్న వివాదంలో బుజ్జి దేశమైన భూటాన్ కు జరుగుతున్న నష్టాన్ని ప్రశ్నించి.. ఆ దేశానికి సాయంగా నిలవటానికి భారత్ నిర్ణయం తీసుకోవటం చైనాకు అస్సలు ఇష్టం లేదు. దీంతో భారత్ పైన మాటల యుద్ధాన్ని మొదలెట్టింది. దీనికి కేంద్ర సర్కారు ధీటుగా ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. సిక్కిం సెక్టార్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా సైనిక విన్యాసాల్ని నిర్వహిస్తోంది. దీనికి ప్రతిగా భారత్ సైతం అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో మన సైనిక బలం ఎంత? ప‌్రత్యర్థి చైనా సైనిక బలగం మాటేమిటి? అన్న క్వశ్చన్లు రాక మానవు. ఈ వ్యవహారంలోకి వెళితే.. చైనాతో పోలిస్తే మనం కాస్త తక్కువేనని చెప్పక తప్పదు. ఇక.. సైనిక.. ఆయుధాల లెక్కల్లోకి వెళితే..
చైనా సైన్యం 16 లక్షల మందితో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా భారత్ 13 లక్షలతో మూడో స్థానంలో ఉంది. సైనిక విషయం ఇలా ఉంటే మందుగుండు సామాగ్రి లెక్కలోకి వెళితే.. గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్ సైట్ ప్రకారం చైనాకు 6457 సైనిక ట్యాంకులు ఉంటే.. భారత్ కు 4426 ట్యాంకులు ఉన్నాయి.
ఆయుధాలు.. మందుగుండు భారత్ చైనా
అర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ (ఏఎఫ్‌వీ) 6704 4788
సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ (శతఘ్నులు) 290 1710
ఫిరంగులు 7414 6246
యుద్ధ విమానాలు 676 1271
సైన్యాన్ని తరలించే రవాణా విమానాలు 857 782
హెలికాఫ్టర్లు (యుద్ధానికి పనికి వచ్చేవి) 16 206
భారీ జల ఉపరితల యుద్ధ నౌకలు 66 283
+ ఆసియాలో భారీ విమాన వాహక యుద్ధ నౌక భారత్‌కు మాత్రమే ఉంది. అయితే.. చైనా మొదటి లియోనింగ్ యుద్ధ నౌకను దేశీయంగా టైప్ 055 భారీ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ గా రూపొందించింది.
+ చైనా దగ్గరి నౌకను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది చెబుతారు. దీన్ని ఉక్రెయిన్ నుంచి చైనా కొనుగోలు చేసింది
+ విమాన వాహక నౌక ఐఎన్ ఎస్ విక్రాంత్ స్థానంలో దేశీయంగా రూపొందించే ఐఎన్ ఎస్ విశాల్ తయారీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాల్ ప్రత్యేకత ఏమిటంటే 65 వేల టన్నుల అణ్వాయుధాలను తీసుకెళ్లే సామర్థ్యం సొంతం.