భారత ఆర్థిక వ్యవస్థపై నోబెల్ అవార్డు విన్నర్ కీలక వ్యాఖ్యలు

Update: 2020-09-30 09:10 GMT
సమర్థుడైన నాయకుడి పాలన.. స్థిరమైన ప్రభుత్వం.. ఇలాంటి సానుకూల వాతావరణం ఉన్న వేళలో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటుందని భావిస్తారు. అందుకు భిన్నంగా రోజురోజుకి ఆర్థిక వ్యవస్థ నీరసించిపోతున్నవైనం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా అదే విషయాన్ని వెల్లడించారు ప్రముఖ ఆర్థికవేత్త.. నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ. ప్రపంచం లోని అత్యంత పేలవం గా ఆర్థిక పరిస్థితి ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా ఆయన చెబుతున్నారు.

పేదవారికి ఇస్తున్న ఆర్థిక ఉద్దీపనలు ఏ మాత్రం సరిపోవన్న ఆయన.. ఈ ఏడాది మూడో త్రైమాసికంగా ఆర్థిక వృద్ధి కాస్త మెరుగ్గా ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జులై-సెప్టెంబరు మూడు నెలల కాలానికి వృద్ధి బాగానే ఉంటుందన్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశ ఆర్థిక పరిస్థితి పై కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ ఎంట్రీ కి ముందే దేశ ఆర్థిక వ్యవస్థ మందగించినట్లుగా చెప్పారు.

అయితే.. ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది (2021)లో ఆర్థిక వృద్ధి రేటు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందేందుకు ప్రభుత్వం ఇస్తున్న ఉద్దీపన సరిపోతుందని తాను అనుకోవటం లేదన్నారు. ఆదాయం తక్కువగా ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టేందు కు ప్రభుత్వం ఇష్టపడకపోవటంతో వారు ఖర్చుకు వెనుకాడుతున్నారన్నారు. ప్రపంచం తో భారత్ మరింత పోటీ పడాల్సిన అవసరం ఉందన్న మాట చూస్తే.. మోడీ సర్కారు చేయాల్సింది చాలానే ఉందన్న భావన కలుగక మానదు.
Tags:    

Similar News