మీ ఐటీ రిటర్న్స్‌లో కాస్త జాగ్రత్త అవసరం
ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరంలోకి (2017-18) అడుగుపెట్టాం. కొత్త ఏడాదిలో పన్ను - పన్ను రిటర్నులకు సంబంధించి పలు నిబంధనలు మారాయి. వాటి పట్ల అవగాహన లేకపోతే ఇబ్బందులు ఎదురవడం ఖాయం. ఈ నేపథ్యంలో సదరు మార్పులు చేర్పులు వివరాలు ఇవి.
-ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి పన్ను రేటును గతంలో ఉన్న 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దాంతో, ఈ శ్లాబు పరిధిలోకి వచ్చే వారికి పన్ను 50 నుంచి 100 శాతం వరకు తగ్గనుంది. ఇతరులకు రూ.12,500 వరకు పన్ను ఆదా అయ్యే అవకాశం ఉంది.
-రూ.3.5 లక్షల లోపు ఆదాయం కలిగినవారికి పన్ను రిబేటును గతంలో ఉన్న రూ.5000 స్థాయి నుంచి రూ.2,500కు తగ్గించారు. అయితే ఈ శ్లాబు వారికి పన్నురేటును 5 శాతానికి తగ్గించడంతో రూ.3 లక్షల వరకు ఆదాయం కలిగిన వారు ఎలాంటి పన్ను చెలించాల్సిన అవసరం లేదు. రూ.3.5 లక్షలకు పైగా ఆదాయం కలిగినవారు మాత్రం రూ.2,575 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
-రూ.50 లక్షల నుంచి రూ.కోటి ఆదాయం కలిగిన వారిపై గరిష్ఠ పన్ను రేటు 30 శాతంపై 10 శాతం సర్ చార్జీ వర్తిస్తుంది. రూ.కోటి కంటే అధిక ఆదాయం కలిగిన వారి నుంచి ఇప్పటికే 15 శాతం సర్ చార్జీ వసూలు చేస్తున్నారు.
-మూలధనంపై దీర్ఘకాల ఆర్జితంగా పరిగణించేందుకు కాలపరిమితిని 3 ఏండ్ల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. రెండేండ్ల కంటే అధికకాలంపాటు యాజమాన్య హక్కులు కలిగిన ఆస్తి విక్రయంపై ఆర్జించే రిటర్నులపై 20 శాతం పన్ను వర్తిస్తుంది. అలాగే పలు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. మూలధన ఆర్జనపై పన్ను భారాన్ని తగ్గించేందుకు వీలుగా కాస్ట్ ఇండెక్సేషన్ బేస్ ఇయర్‌ను ఏప్రిల్ 1 - 1981 నుంచి ఏప్రిల్ 1 - 2001కి మార్చింది. అంతేకాదు, ఈసారి నుంచి ఎన్ హెచ్ ఏఐ - ఆర్ ఈసీ బాండ్లతోపాటు నోటిఫైడ్ రిడీమబుల్ బాండ్లలో తిరిగి పెట్టుబడిగా పెట్టిన సొమ్ము ద్వారా ఆర్జించిన మూలధన ఆర్జనపైనా పన్ను రాయితీ లభించనుంది.
-రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం ద్వారా లిస్టెడ్ ఈక్విటీ షేర్లలో తొలిసారిగా పెట్టుబడులు పెట్టేవారికి కల్పించే రాయితీలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఒకవేళ పన్ను చెల్లింపుదారులు ఈ పథకం కింద ఇప్పటికే రాయితీ క్లెయిమ్ చేసుకొని ఉంటే గనుక మరో రెండేండ్లపాటు ఈ వసతి అందుబాటులో ఉంటుంది.
-రూ.50 వేలకు మించి అద్దె చెల్లించేవారు టీడీఎస్ (మూలం వద్దే పన్ను మినహాయింపు) కిందే 5 శాతం మినహాయించుకోవాలి. ఈ నిబంధన జూన్ 1 నుంచి అమలులోకి రానుంది. భారీ మొత్తంలో అద్దె ఆదాయం ఆర్జించేవారు పన్ను పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఈ నిబంధనను ప్రవేశపెట్టినట్లు నిపుణులు చెప్తున్నారు.
-నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్ పీఎస్) నుంచి పాక్షికంగా సొమ్ము ఉపసంహరించుకునేవారు ఇకపై ఆపై సొమ్ముపై ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఎన్ పీఎస్ చందాదారులు తమ ఖాతాలో అప్పటివరకు జమైన సొమ్ము నుంచి గరిష్ఠంగా 25 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే రిటైర్మెంట్ సమయంలో విత్ డ్రా చేసుకునే సొమ్ములో 40 శాతం పన్ను పరిధిలోకి వస్తుంది.
రిటర్నుల ఫైలింగ్ జాప్యమైతే జరిమానా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆన్‌లైన్‌లో రిటర్నులు ఫైలింగ్ చేసేందుకు వీలుగా ఈనెల 1 నుంచి ఈ-ఫైలింగ్ విండోను అందుబాటులోకి తెచ్చింది ఐటీ శాఖ. రిటర్నుల ఈ-ఫైలింగ్‌కు గడువు జూలై 31తో ముగియనుంది. గడువు దాటాక ఈ-ఫైలింగ్ చేస్తే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ రిటర్ను వచ్చే ఏడాది డిసెంబర్ 31లోగా ఫైల్ చేస్తే రూ.5వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాఖలు చేస్తే రూ.10 వేలు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. రూ.5 లక్షల లోపు ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారులపై విధించే జరిమానాను మాత్రం రూ.1,000కి పరిమితం చేశారు. వ్యక్తిగత ఆదాయం పన్ను రిటర్నుల దాఖలు మరింత సులభతరం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం సింగిల్ పేజీ రిటర్ను ఫామ్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకున్న ఏడు పేజీల ఫామ్ స్థానంలో కేవలం ఒక పేజీతో కూడిన ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఫామ్-1(సహజ్)ను అందుబాటులోకి వచ్చింది. వేతనం, ఇంటి అద్దె, వడ్డీ ఇంకా ఇతర మార్గాల్లో ఏటా రూ.50 లక్షల వరకు ఆదాయం ఆర్జించే వ్యక్తులు ఈ ఫామ్ ద్వారా ఐటీ రిటర్నులు దాఖలు చేయవచ్చు.
ఈ ఫామ్ ద్వారా 2 కోట్లకు పైగా ఆదాయం పన్ను చెల్లింపుదారులకు లబ్ధి కలుగనుందని ప్రభుత్వం అంటున్నది. ఈ రిటర్ను ఫామ్‌లో తమ పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్)తోపాటు ఆధార్ నంబర్ కూడా తప్పనిసరిగా పేర్కొనాలి. అంతేకాదు, పెద్ద నోట్ల రద్దు తర్వాత (గత ఏడాది నవంబర్ 9-డిసెంబర్ 30 మధ్యలో) బ్యాంకు ల్లో గనుక రూ.2 లక్షలు లేదా అంతకంటే అధిక మొత్తంలో డిపాజిట్ చేసిన పక్షంలో ఆ వివరాలను సైతం రిటర్నులలో తప్పనిసరిగా వెల్లడించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/