ఆ విషయంలో.. కాంగ్రెస్‌ను బీజేపీ కాపీ కొడుతోందా?
వారు వీరైనట్టుగా ఉంది.. బీజేపీ పరిస్థితి! జాతీయ పార్టీల్లో తమకంటూ.. ప్రత్యేక స్థానం సంపాయించుకుం టామని ఈ పార్టీ నేతలు పదే పదే చెబుతుంటారు. అంతేకాదు.. వీలున్నప్పుడల్లా.. కాంగ్రెస్‌పార్టీని విమర్శి స్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రణాళిక లేదని, ఆధిపత్య రాజకీయం, అధికార దాహం ఎక్కువని.. బాసిజంలో కాంగ్రెస్‌ను మించిన పార్టీ లేదని కూడా కమల నాథులు కామెంట్లు చేస్తుంటారు. ఇక, కాంగ్రెస్ దుస్థితికి.. ఆపార్టీ అవలంభించిన విధానాలే కారణమని కూడా బీజేపీ పెద్దలు తరచుగా చెబుతుంటారు. దీనిలో వారు ప్రధానంగా విమర్శించే విషయం.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను పదే పదే మార్చడం.
``ఇలా ముఖ్యమంత్రులను పదే పదే మార్చేపార్టీ ఏదైనా ఉంటే.. అది కాంగ్రెస్సే! ఆ పార్టీ కి సొంత నేత లపైనే నమ్మకం ఉండదు. అందుకే ముఖ్యమంత్రులను మారుస్తుంది. దీనివల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతోందో ఆ పార్టీకి అర్ధం కావడం లేదు కానీ, మేం అలా కాదు``-ఇదీ.. ప్రధాని మోడీ.. కొన్నాళ్ల కిందట కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ.. చేసిన వ్యాఖ్యలు. ఇటీవల యూపీ సీఎంను మారుస్తారంటూ.. వచ్చిన ప్రచారం సందర్భంలోనూ బీజేపీ జాతీయ నేతలు ఇలానే రియాక్ట్ అయ్యారు. ``ముఖ్యమంత్రులనుమార్చడానికి ఇదేమన్నా.. కాంగ్రెస్ పార్టీనా?`` అని జేపీ నడ్డా విరుచుకుపడ్డారు.
అయితే.. ఇన్ని నీతులు చెప్పిన.. బీజేపీ పెద్దలు..ఇప్పుడు అదే కాంగ్రెస్ బాటలో నడుస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం.. తాజాగా దేవభూమిగా ప్రసిద్ధి చెందిన ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రులను వరుస పెట్టి మార్చడమే. కేవలం నాలుగు మాసాల్లో ముగ్గురు ముఖ్యమంత్రులను బీజేపీ మార్చింది. 2017 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో విజయం సాధించిన బీజేపీ.. తాజాగా మూడో ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీకి పగ్గాలు అప్పగించింది. మరి.. ఇప్పుడు బీజేపీ నేతలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బాటలో నడిచినట్టే కదా? అంటున్నారు విశ్లేషకులు.
ఇలా.. చేస్తే.. కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా అయితే.. ప్రాంతీయ పార్టీగా దిగజారిపోయిందో.. అదేదుస్థితి బీజేపీకి కూడా పడుతుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రులను మార్చడం ద్వారా.. పార్టీలో ఐనైక్యత ఏర్పడి.. నాయకులు బయటకు వచ్చి.. సొంత కుంపటి పెట్టుకుని.. కాంగ్రెస్‌కే ప్రత్యర్థులుగా మారిన చరిత్ర చాలా రాష్ట్రాల్లో ఉంది. ఈ పరిస్థితి బీజేపీకి మాత్రం ఎందుకు ఎదురుకాదని వారు అంటున్నారు. అదే సమయంలో పదే పదే సీఎంలను మార్చడం వల్ల పెట్టుబడులు కూడా రావని, తద్వారా.. నిరుద్యోగులకు అవకాశం దక్కకపోవడంతోపాటు.. ఈ సమస్య మరింత పెరుగుతుందని అంటున్నారు. మరి ఇప్పటికైనా బీజేపీ నేతలు ఈ విధానాన్ని మార్చుకుంటారో లేదో చూడాలి.