అఫ్గాన్ లో కాదు ఆ దేశంలో ఇప్పుడు లీటరు పాలు రూ.1195

Update: 2021-10-12 04:30 GMT
మనకు ఇరుగున ఉండే చిట్టి దేశం శ్రీలంక. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకు ఆకాశ మార్గంలో కేవలం 40 నిమిషాల వ్యవధిలో చేరుకునే శ్రీలంకలో ఇప్పుడు నిత్యవసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఎందుకు? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్న. ఇప్పుడా దేశంలో లీటరు పాలు ఏకంగా రూ.1195కు చేరుకోవటంతో ఆ దేశస్తులు కిందామీదా పడిపోతున్నారు. అంతేకాదు.. నిత్యవసర వస్తువుల కోసం శ్రీలంక ప్రజలు ఇప్పుడు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితికి కారణం ఏమిటి? అసలేం జరిగింది? ఇంతటి ఆర్థిక సంక్షోభానికి కారణం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

వస్తువులపై శ్రీలంక ప్రభుత్వం నియంత్రణ ఎత్తేయటంతో ఎవరికి వారు వస్తువుల ధరల్ని భారీగా పెంచేస్తున్నారు. దీంతో.. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎందుకిలా? దశాబ్దాల తరబడి ప్రచ్ఛన్న యుద్ధం సాగిన వేళలోనూ లేని తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎందుకిప్పుడే వచ్చింది? అన్నవిషయంలోకి వెళితే.. దీనికి కారణం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలుగా చెబుతున్నారు. కరోనా కారణంగా ఎగుమతులు దెబ్బ తినటం.. ప్రత్యేకించి ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు అయిన పర్యాటక రంగం కుదేలు కావటం ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బ తీసింది.

దీంతో ఉన్న విదేశీ మారక నిల్వలు కరిగిపోవటంతో దిగుమతులపై పరిమితులు విధించి.. ఆ తర్వాత నిషేధాన్ని విధించారు. దీంతో.. నిత్యవసర వస్తువులైన పప్పులు.. పంచదార.. గోధుమపిండి.. కూరగాయలు లాంటి వాటి ధరలు భారీగా పెరిగిపోయాయి. శ్రీలంకలో ఇబ్బందికర పరిస్థితి ఏమంటే.. పప్పులు.. పంచదార.. గోధుమ పిండి లాంటివి కూడా దిగుమతులు చేసుకోవాల్సిందే. దీంతో సరఫరాకు డిమాండ్ కు మధ్య అంతరం పెరిగిపోయింది. దీంతో.. ధరలు భారీగా పెరిగాయి.

దీనికి తోడు అక్రమ నిల్వలు పెరిగిపోవటంతో మార్కెట్లో కొరత మొదలైంది. దీంతోధరలు భారీగా పెరిగాయి. గ్యాస్ సిలిండర్ రూ.2657కు పెరిగింది. పప్పులు.. పంచదార.. గోధమపిండి లాంటి ధరలు పెరిగాయి. వీటిని తగ్గించేందుకు దేశ అధ్యక్షుడు గొలబాయ రాజపక్సే అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి.. ధరలపై నియంత్రణ ఎత్తేయాలని నిర్ణయించారు. దీంతో.. ధరలు మరింత పెరిగిపోయాయి. దీంతో.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా ఆ దేశం పయనిస్తోంది.


Tags:    

Similar News