అమెరికా ఆశలా.. నేటి నుంచే మార్పులు.?

Update: 2020-02-24 13:00 GMT
గ్రీన్ కార్డు.. అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఇచ్చే వీసా.. అమెరికాలో ఫుడ్ స్టాంప్స్ తదితర ప్రభుత్వ ప్రయోజనాలు పొందే చట్టబద్ద వలసదారులకు గ్రీన్ కార్డు ఇస్తారు. అయితే ఇప్పుడు  సోమవారం నుంచి కొత్త గ్రీన్ కార్డు నిబంధనలు అమలులోకి రానున్నాయి.

అమెరికాలో హెచ్1బీ వీసాపై ఉంటూ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది భారతీయులపై ఈ కొత్త గ్రీన్ కార్డు నిబంధనలు ప్రభావం చూపనున్నాయి. తాజాగా ఈ నిబంధనలపై ఇచ్చిన స్టే ఆర్డర్ ను అమెరికా సుప్రీం కోర్టు ఎత్తివేసింది.

తాజాగా అమల్లోకి వస్తున్న గ్రీన్ కార్డు నిబంధనల ప్రకారం.. ఎవరైనా విదేశీయులైన వలసదారులు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే మొదట తాము ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేదని.. భవిష్యత్ లోనూ వాటిని ఆశించమని... అమెరికాకు భారం కాబోమని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ అమెరికా ప్రయోజనాలు  వినియోగిస్తే గ్రీన్ కార్డు నిరాకరించే అవకాశం ఆ దేశానికి ఉంటుంది.  దీని వల్ల విదేశీయులకు ఎటువంటి హక్కులు ఉండవు. భారతీయులకు ఇది శరాఘాతంగా మారనుంది.

ఏటా దాదాపు 5.4 లక్షల మంది గ్రీన్ కార్డు అప్లై చేసుకుంటారు. అయితే ఈ వలసదారుల్లో కొందరికి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు కొత్త నిబంధనలతో వలసవాదులకు అసలు హక్కులే లేకుండా పోతాయి. వచ్చిన వారికి ఇమిగ్రేషన్ స్టేటస్ ను బట్టి ప్రభుత్వ ప్రయోజనాలు తాత్కాలికంగా అందుతాయన్న మాట..


Tags:    

Similar News