ఏపీ మీడియా క్రూరత్వాన్ని బయటపెట్టిన ఐఐఎంఏ

Update: 2020-08-27 07:10 GMT
సుందరవల్లి నారాయణ స్వామి మార్గదర్శకత్వంలో ఐఐఎం-అహ్మదాబాద్ ఏపీలో ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో ఇక్కడి మీడియా క్రూరత్వాన్ని బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని షాకింగ్ నిజాలను వెల్లడించింది.

అధ్యయనంలో ఏపీలో కింది స్థాయి నుంచి మీడియా వల్ల చాలా దారుణాలు చోటుచేసుకుంటున్నాయని.. ప్రజలు, వ్యాపారులు ప్రభావితమై సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఐఐఎం అహ్మదాబాద్ విచారణలో నిగ్గుతేలింది.

ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో లోపాయికారులు.. మధ్యవర్తులు, గూండాలను మీడియా, కొన్ని పార్టీలు ఇన్ సైడ్ గా ఉంచుకొని.. వాటిని లీక్ చేస్తున్నారని.. ఇందులో మీడియా సామాజిక వ్యతిరేక పాత్ర పోషిస్తోందని అధ్యయనం తేల్చిచెబుతోంది.

 ఈ క్రమంలోనే అధికారుల బాధ్యతలను సజావుగా అమలు చేసేలా చూసేందుకు.. మీడియాను పాలక వ్యవస్థకు దూరంగా ఉంచాలని ఐఐఎంఏ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.  మీడియా సృష్టించిన ఒత్తిడి కారణంగా చాలా మంది అధికారులు, సిబ్బంది తమ విధులను నిర్వర్తించలేకపోతున్నారని అధ్యయనం చెబుతోంది.

వ్యవస్థలో అవినీతిని మీడియా కూడా ప్రోత్సహిస్తోందని.. అది కూడా పాటుపడుతోందని అధ్యయనం సంచలన నివేదికను రాష్ట్ర సర్కార్ కు అందజేసింది. ఈ నివేదిక రాష్ట్రంలో మీడియా ఎంతటి తతంగం చేస్తుందో కళ్లకు కట్టిందని వైసీపీ నేతలు ఆడిపోసుకుంటున్నారు.
Tags:    

Similar News