ఆక్సిజన్ 90 శాతం కంటే తగ్గితే ప్రమాదమే ... అప్పుడు ఏంచేయాలంటే ?

Update: 2020-07-15 11:45 GMT
ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. దేశవ్యాప్తంగా రోజురోజుకి కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీనితో అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. ముఖ్యంగా కరోనా బాధితుల్లో ఎక్కువగా  ఆక్సిజన్‌ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే,  కరోనా సోకిన వాళ్లందరికీ ఆక్సిజన్‌ అవసరం లేదని.. కేవలం 5 శాతం మందికి మాత్రమే అవసరం అవుతోందని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.  

అలాగే వైద్య బృందం మాట్లాడుతూ ..ఆరోగ్యంగా ఉన్న వారి రక్తంలో 95 శాతం వరకూ ఆక్సిజన్‌ నిల్వలు ఉంటాయి అని , అలాగే , 90 శాతం  ఉన్నా కూడా  ఎలాంటి ఇబ్బందీ ఉండదు అని , అయితే  90 శాతం కంటే తగ్గితే ఒకసారి డాక్టర్‌ ను  సంప్రదిస్తే చాలామంచిది అని చెప్తున్నారు. ఇక 85 శాతం కంటే తగ్గితే కచ్చితంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఉన్నట్టు అర్థంచేసుకోవాలి. అలాంటి వారు వెంటనే వైద్య సాయం పొందడం మంచిది అని చెప్తున్నారు. అయితే , సాధారణంగా ఆరోగ్యవంతుల్లో 90 శాతం కంటే ఆక్సిజన్‌ తగ్గదు.  దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు.. 60 ఏళ్లు దాటిన వారు అప్పుడప్పుడూ ఆక్సిజన్‌ శాతాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలని తెలిపారు.  నడక, ప్రాణాయామం వంటివి ఆక్సిజన్‌ లెవెల్స్‌ను పెంచుతాయి అని తెలిపారు.
Tags:    

Similar News