మోడీ లక్ష కోట్లు ఇస్తే రాజధాని అమరావతే ...వైసీపీ ఎమ్మెల్యే !

Update: 2020-01-13 08:02 GMT
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మంచి కాక మీద ఉంది. దీనిపై ప్రభుత్వ,  విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే బీజేపీ ప్రభుత్వం పై , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో భవ్యమైన దివ్యమని రాజధానిని కట్టి ఇస్తామంటూ 2014 ఎన్నికల వేళ తిరుపతి వేదికగా నాటి ప్రధాని అభ్యర్ధి  నరేంద్ర మోడీ తిరుపతి వేదికగా ఆ దేవదేవుని సన్నిధిలో హామీ ఇచ్చారు.

అనుకున్నట్లుగా ఆయన ప్రధాని అయ్యారు. ఏపీ రాజధానికి ఇచ్చింది ఎంత అని చూస్తే  అక్షరాలా పదిహేనువందల కోట్ల  రూపాయలు మాత్రమే. మరి దాంతోనే రాజధాని అయిపోతుందనుకున్నారేమో. మరో వైపు బీజేపీ మిత్రపక్షం టీడీపీ అప్పట్లో ఏపీలో అధికారంలో ఉంది. ఆ పార్టీ ప్రభుత్వం ఏకంగా లక్ష కోట్ల పై చిలుకు భారీ బడ్జెట్ తో రాజధాని తామే కడతామని అయిదేళ్ళూ గడిపేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పచ్చని పంటలు పండే పొలాల నుంచి  ముప్పయి మూడు వేల ఎకరాల భూమిని తీసుకున్నారు. రాజధాని గ్రాఫిక్స్ సెట్టింగులతో  టైమ్ పాస్ చేశారు. ఇపుడు జగన్ మూడు రాజధానులంటూ ప్రతిపాదించగానే అటు టీడీపీ, ఇటు బీజేపీ ఠాట్.. అక్కడే రాజధాని కట్టండని అంటున్నాయి.
Read more!

దీని మీద ఒళ్ళు మండిపోయిందో ఏమో కానీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గట్టిగానే బీజేపీని తగులుకున్నారు. అమరావతిలో లక్ష కోట్లతో రాజధాని కట్టేందుకు మేము రెడీ. కానీ ఆ లక్ష కోట్లు నిధులు కేంద్రం ఇవ్వాలంటూ బాగానే డిమాండ్ చేశారు. విభజన ఏపీకి కొత్త రాజధాని కట్టిస్తామని చెప్పిన కేంద్రానికి ఆ బాధ్యత లేదా అంటూ ఆయన గట్టిగా తగులుకున్నారు. లక్ష కోట్లు ఇస్తే అమరావతిని అక్కడే తెచ్చి నిలబెడతామని కూడా మంత్రి సెటైర్లు వేశారు. పదిహేను వందల కోట్లు నిధులు ఇచ్చి లక్ష కోట్ల అమరావతిని కట్టమనడమేంటని ఆయన కమల‌నాధుల పైన ఫైర్  అయ్యారు. కేంద్రానిదే రాజధాని నిర్మించే  బాధ్యత. మరి ఆ పని చేయకుండా అనవసరంగా లేనిపోని విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
Tags:    

Similar News