లోకేష్ గ‌డ్డం పెంచితే.. క‌నీసం ఎమ్మెల్యే అవుతాడా?.. ఇదో చ‌ర్చ‌

Update: 2021-07-06 11:30 GMT
టీడీపీ జాతీయ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి నారా లోకేష్ విషయం ఇటీవ‌ల కాలంలో ఆస‌క్తిగా మారింది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు బొద్దుగా ఉన్న లోకేష్‌.. క‌రోనా పుణ్య‌మాని.. దాదాపు ఏడాది పాటు.. హైద‌రాబాద్‌లోనే ఉండి స్లిమ్ అయ్యారు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లో కొద్దిగా త‌గ్గిన లోకేష్‌.. త‌ర్వాత‌.. మ‌రింత‌గా వ‌ర్క‌వుట్స్ చేసి.. మ‌రింత నాజూకుగా మారారని పార్టీలో చ‌ర్చ సాగుతోంది. అదేస‌మ‌యంలో గ‌డ్డం పెంచ‌డం మ‌రింత ఆక‌ర్ష‌ణ‌గా ఉంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

అయితే.. ఇదే స‌మ‌యంలో మ‌రో ఆస‌క్తిక‌ర కామెంట్ కూడా వినిపిస్తోంది. గ‌డ్డెం పెంచాడు స‌రే.. మ‌రి ఎమ్మెల్యే అవుతాడా? అనేది ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. నిజానికి రాజ‌కీయాల్లో నాయ‌కులు చాలా మంది ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే నేత‌లు చాలా త‌క్కువ మంది ఉంటారు. ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా.. ఈ పార్టీ భావి అధ్య‌క్షుడిగా భావిస్తున్న లోకేష్‌కు మ‌రింత ఆక‌ర్ష‌ణ అవ‌స‌రం. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇది లేక‌నే.. ఆయ‌న‌కు ఫాలోయింగ్ త‌గ్గిపోయింద‌నే వాద‌న ఉంది.

దీనికితోడు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో పోటీ ప‌డుతున్న లోకేష్‌.. జ‌గ‌న్ మాదిరిగా స్లిమ్ గా లేకుండా బొద్దుగా ఉండ‌డంపైనా కామెంట్లు కురిశాయి. దీంతో ఆయ‌న వేషంమార్చుకున్నారు. దీంతో ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లు ఆయ‌న‌ను గుర్తిస్తారా?  ఆయ‌న గ‌డ్డం.. స‌న్న‌బ‌డ‌డం వంటివాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారా? అనేది ప్ర‌శ్నార్థ‌క‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఒక‌టి చంద్ర‌బాబును గుర్తిస్తున్న విధంగా టీడీపీ అనుకూల మీడియా లోకేష్‌ను గుర్తించ‌డంలేదు.

పైగా టీడీపీ అనుకూల మీడియాతోనూ లోకేష్ స‌ఖ్య‌త‌గా లేర‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు లోకేష్ ఎమ్మెల్యే కావ‌డం అత్యంత ముఖ్య‌మని అంటున్నారు సీనియ‌ర్ నేత‌లు. లోకేష్ ఎమ్మెల్యే అయితేనే.. టీడీపీకి మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంద‌ని.. అదేస‌మ‌యంలో వ్య‌క్తిగ‌తంగా లోకేష్ ఇమేజ్ కూడా పెరుగుతుంద‌ని చెబుతున్నారు. ఇలా క‌నుక జ‌ర‌గ‌క‌పోతే.. స్ట‌యిల్ మార్చినా.. లోకేష్ పొలిటిక‌ల్‌గా పుంజుకోవ‌డం క‌ష్ట‌మేనని అంటున్నారు. ఈ క్ర‌మంలో తెలుగులో ధారాళంగా మాట్లాడే ప‌రిస్థితి రావాల‌ని.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేలా పంచ్ డైలాగుల‌తో దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని సూచిస్తున్నారు. మ‌రి లోకేష్ ఏం చేస్తాడో చూడాలి. 
Tags:    

Similar News