మాజీ పోలీసు అధికారి ఆస్తులు 400 కోట్లు!

Update: 2017-06-10 18:20 GMT
అవినీతి విష‌యంలో క‌ళ్లు చెదిరే ఉదాహ‌ర‌ణ ఇది. కేరళకు చెందిన ఓ మాజీ పోలీసు అధికారి అక్ర‌మ సంపాద‌న‌తో కోట్లకు పడగలెత్తాడు. ఈ అవినీతి తిమింగలం రూ. 400 కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నాడు. నాగలాండ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా విధులు నిర్వర్తించిన ఎంకేఆర్ పిళ్లై పదవీవిరమణ పొందాడు. పిళ్లైకి శ్రీవాలసమ్ గ్రూప్ అనే సంస్థ ఉంది. ఈ సంస్థలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పిళ్లైకి సంబంధించిన అక్రమ ఆస్తుల చిట్టా బయటపడింది. అది కూడా క‌ళ్లు తిరిగే రేంజ్‌ లో ఉండ‌టం ఆస‌క్తిక‌రం.

కేరళ - కర్ణాటక - నాగలాండ్ - ఢిల్లీలో పిళ్లైకి సంబంధించిన నివాసాలలో అధికారులు తనిఖీలు చేశారు.  బినామీ పేర్లతో పలు సంస్థలు నడుపుతున్నట్లు అధికారుల సోదాల్లో వెలుగు చూశాయి. విధుల్లో ఉన్న సమయంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల నిధులను తన సంస్థలోకి మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు. పోలీసు అధికారి రాష్ట్రపతి పోలీసు మెడల్ కూడా అందుకున్నాడు. 1971లో నాగలాండ్‌ లో కానిస్టేబుల్‌ గా విధుల్లో చేరారు. ఆరేళ్ల క్రితం అడిషనల్ ఎస్పీగా రిటైర్డ్ అయ్యారు. పిళ్లై సార్‌గా నాగలాండ్‌ లో ఆయన అందరికీ సుపరిచితం. రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులతో ఈయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం పిళ్లై నాగలాండ్ పోలీసు శాఖలో కన్సల్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
Read more!

పిళ్లై అక్రమాస్తులకు సంబంధించి నాగలాండ్ డీజీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం పిైళ్లె సెలవుల్లో ఉన్నారని, వచ్చే వారం విధుల్లో చేరుతారని తెలిపారు. అప్పుడు మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. కొస‌మెరుపు ఉత్తమ సేవకు గానూ 2005లో రాష్ట్రపతి పోలీసు మెడల్ అందుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News