పవన్ పార్టీ పెట్టడం మాకిష్టం లేదు - నాగబాబు

Update: 2019-07-30 13:41 GMT
జనసేన పార్టీ పెట్టినపుడు ‘‘మెగా ఫ్యామిలీకి రాజకీయం మోజుపోలేదు. ఇంకో రూట్లో వచ్చారు‘‘ అన్న కామెంట్లూ వినిపించాయి, అన్న ఫెయిలయ్యినా తమ్ముడు ధైర్యం చేశాడన్న కామెంట్లూ వినిపించాయి. అంతే.. మెగా ఫ్యామిలీలో ఇతరులు ఎవరూ చేరకుండా మొదలైన ఆ పార్టీ గురించి మెగా ఫ్యామిలీ ఏమనుకుందో ఈరోెజు నాగబాబు వెల్లడించారు. అన్న చిరంజీవి పార్టీ పెట్టినపుడు  పడిన ఇబ్బందులు, అవమానాలు కళ్లారా చూశాం. అందుకే ఇక వద్దనుకున్నాం. ‘జనసేన’ పెట్టడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు అని నాగబాబు అన్నారు.

ఈరోజు ఇటీవలే ఏర్పాటైన జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.ఇందులో నాగబాబు సభ్యులు. దీంతో మీటింగ్ కు హాజరైన నాగబాబు జనసేన పుట్టుక, పవన్ గురించి, పార్టీ గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే... ’జనసేన ఆవిర్భావ సభ సమయంలో నేను గోవాలో షూటింగ్ లో ఉన్నాను. రెండు గంటలు  ప్రసంగం విన్నాను. పవన్ కళ్యాణ్ ఆదర్షాలు కొంతవరకు అర్థమయ్యాయి. కానీ జనసేన మార్గమేంటో అర్థం చేసుకోవడానికి నాకు రెండున్నరేళ్లు పట్టింది. నేను పార్టీలో అందరి కన్నా జూనియర్ ని. ఒక విషయం మాత్రం నాకు స్పస్టంగా తెలుసు. పవన్ అనితర సాధ్యుడు. పట్టుదల, మొండితనం రెండూ ఎక్కువే. అందుకే పార్టీ ఇక్కడిదాకా తేగలిగాడు. పవన్ కళ్యాణ్ వంటి వారు ఏపీకి ఇపుడు అవసరం‘‘ అని నాగబాబు వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా నాగబాబు రాజకీయాల గురించి పలు కామెంట్లు చేశారు. రాజకీయాలు నేడు ఆదాయ వనరుగా మారిపోయాయని అన్నారు. జనసేన ఈ రాజకీయాల్ని సమూలంగా మార్చే ఉద్దేశంతో ముందుకు పోతోంది. కచ్చితంగా మారుస్తుంది. నేను నిరంతరం పార్టీ కోసం పనిచేస్తాను. పవన్ ఏమీ ఆశించని నిస్వార్థ నాయకుడు... పార్టీ కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అధికారం చేపడుతుందని నాగబాబు అన్నారు.


Tags:    

Similar News