నాకు సీఎం పదవిపై ఆసక్తి లేదు.. అక్కర్లేదు

Update: 2020-12-28 08:15 GMT
నాలుగు సార్లు వరుసగా బీహార్ సీఎంగా ఎన్నికైన నితీష్ కుమార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమైందో కానీ పార్టీపై, ప్రభుత్వంపై ఆయన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పొత్తుల సంసారంలో ప్రస్తుతం బీహార్ లో నితీష్ సీఎంగా కొనసాగుతున్నారు. జేడీయూ కంటే బీజేపీనే మొన్నటి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించింది. ఈ క్రమంలోనే నితీష్ తాజాగా హాట్ కామెంట్స్ చేయడం వైరల్ అయ్యాయి.

  ఇప్పటిదాకా నితీష్ కుమారే జేడీయూ అధ్యక్షుడిగా ఉండేవాడు. తాజాగా ఆ అత్యున్నత పదవిని తనకు నమ్మకస్తుడైన రామచింద్ర సింగ్ కు నితీష్ కట్టబెట్టాడు.

తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి లేదని.. ఆ పదవి అక్కర్లేదని నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఎన్నికల తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టలేనని సంకీర్ణ కూటమికి తెలుపానన్నారు.

అయితే ఇందుకు బీజేపీ సంకీర్ణ కూటమి అంగీకరించకపోవడంతో ఎంతో ఒత్తిడితో మరోసారి సీఎం పదవిని చేపట్టానని నితీష్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

నితీష్ కుమార్ కు స్వంతంగా బలం లేకపోవడం.. బీజేపీ మద్దతుతోనే ఆయన సీఎంగా నిలబడడం.. బీజేపీ ఆధిపత్యం బీహార్ ప్రభుత్వంలో పెరిగిపోవడంతోనే నితీష్ ఇలాంటి వైరాగ్యపు మాటలు మాట్లాడాడని ఆ రాష్ట్రంలో ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News