హైదరాబాద్ విద్యార్థి కెనడాలో 27వ అంతస్తు నుంచి కిందపడి మృతి

Update: 2020-11-10 08:30 GMT
హైదరాబాద్ కు చెందిన తెలుగు విద్యార్థి ఒకరు కెనడాలో ప్రమాదవశాత్తు మరణించిన వైనం షాకింగ్ గా మారింది. ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లిన అఖిల్ అనే 19 ఏళ్ల విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించిన వైనం ఇప్పుడా కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఉండే అఖిల్.. హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేసేందుకు టోరంటోకు వెళ్లారు. తొలి సెమిస్టర్ ను పూర్తి చేసుకున్న అఖిల్.. హైదరాబాద్ కు వచ్చి గత నెల ఐదున తిరిగి కెనడాకు వెళ్లారు.

తానుండే బహుళ అంతస్తుల భవనంలో నివాసం ఉండే అఖిల్.. తానుండే 27వ అంతస్తు బాల్కనీలో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పై నుంచి కిందకు పడటంతో మరణించినట్లుగా వనస్థలిపురంలోని అతడి తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఉన్నత చదువు చదువుతున్న తమ కొడుకు ప్రమాదవశాత్తు మరణించిన విషయం గురించితెలిసిన అఖిల్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

తమ కుమారుడి మృతదేహానని నగరానికి తెప్పించాల్సిందిగా ఆయన మంత్రి కేటీఆర్ ను కోరుతున్నారు. కేటీఆర్ ట్విట్టర్ ఖాతాకు ట్వీట్ చేసిన దానిపై స్పందించిన కేటీఆర్.. అఖిల్ మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అఖిల్ కోసం కెనడాలోని రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు.
Tags:    

Similar News