హైదరాబాద్ ను మూడు ముక్కలు చేస్తున్నారా?
తెలంగాణ రాష్ట్రంలో 15 వరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు షురూ చేయటం తెలిసిందే. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు ఒక ఎత్తు అయితే.. హైదరాబాద్ జిల్లాను ఏం చేయనున్నారు? కీలకమైన రంగారెడ్డి జిల్లా మాటేమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఇక.. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ కు సంబంధించి ఆసక్తికర విషయాల్ని చెబుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన గందరగోళ స్థితి నుంచి.. కొత్త జిల్లాల విభజనకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ ను ఎన్ని కొత్త జిల్లాలు చేయాలన్న అంశంపై అధికారులు ఒక పక్కా ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. కలెక్టర్లు.. పోలీసు అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. హైదరాబాద్ ను మూడు ముక్కలు చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ను హైదరాబాద్.. గోల్కొండ.. సికింద్రాబాద్ జిల్లాలుగా విభజించాలన్న ఆలోచనలో కేసీఆర్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రంగారెడ్డి జిల్లా విషయానికి సంబంధించి చూస్తే.. వికారాబాద్ కేంద్రంగా ఏర్పాటుచేసే జిల్లాకు రంగారెడ్డి జిల్లా పేరును పెట్టాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
మరి.. మూడు ముక్కలు చేయనున్న హైదరాబాద్ జిల్లాలో ఏయే ప్రాంతాలు ఏయే జిల్లాల్లో ఉంటాయన్న విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు.. రేపు నిర్వహిస్తున్న కలెక్టర్ల వర్క్ షాపుతో కొత్త జిల్లాల ఏర్పాటుపై మరింత క్లారిటీ రానుంది. కొత్త జిల్లాలు.. అందులో ఉండాల్సిన మండలాలు.. రెవెన్యూ డివిజన్ల పునర్ వ్యవస్థీకరణ లాంటి అంశాలపై ఈ వర్క్ షాపులో చర్చించి తుది నివేదిక సిద్ధం చేయనున్నట్లుగా చెబుతున్నారు. మిగిలిన జిల్లాల సంగతి ఎలా ఉన్నా.. విశ్వనగరమైన హైదరాబాద్ మహా నగరం మొత్తంగా నాలుగైదు జిల్లాలుగా మారనుందని చెప్పొచ్చు.