బాధితుడికి కొత్త కారు ఇప్పించిన ‘‘కోర్టు’’
కొత్త కారు కొన్నాక సాంకేతిక సమస్యలు ఎదురైతే ఏం చేయాలి? అదృష్టం అంతేనని భావించి కంపెనీ షోరూం చుట్టూ తిరగాలి. వారి రిపేరు చేసి ఇస్తే.. వాడుకోవాలనుకోవటం కామన్. కానీ.. అలాంటి అవసరం లేదని.. కొత్తగా కొన్న వాహనంలో లోపాలు తలెత్తితే.. దాన్ని తయారీ లోపంగా పరిగణించాలని.. వాటిని సరిదిద్ద లేకపోతే కొత్త వాహనం ఇవ్వాలంటూ మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీకి తన తీర్పుతో ఆదేశాల్ని జారీ చేసింది వినియోగదారుల ఫోరం. ఆసక్తికరంగా మారిన ఈ తీర్పు ఉదంతంలోకి వెళితే..
2014 ఏప్రిల్ లో హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన ప్రతాప్ సింగ్ ఒక డీలర్ వద్ద మహీంద్ర కంపెనీకి చెందిన స్కార్పియో వాహనాన్ని కొనుగోలు చేశారు. కారు కొన్న వెంటనే కారు ఇంజిన్ లో శబ్దం రావటం.. ఆయిల్ కారటం లాంటి సమస్యలు తలెత్తాయి. వాటిని డీలర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం లభించలేదు.
ఇదిలా ఉంటే 2015 జనవరిలో రిపేర్ కోసం వాహనాన్ని ఇస్తే.. దాన్ని మార్చి 18 వరకూ వాహనాన్ని ఇచ్చింది లేదు. దీనిపై వేదన చెందిన వినియోదారుడు కంపెపనీ తీరుకు విసిగిపోయి.. వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనను విన్న వినియోగదారుల ఫోరం చివరకు తన తీర్పును వెల్లడించింది. వాహనం తయారీ లోపాన్ని నిపుణులతో ధ్రువీకరించాల్సిన బాధ్యత కొనుగోలుదారుడిదేనన్న కంపెనీ వాదనతో ఏకీభవిస్తూనే.. పదే పదే సమస్యలు తలెత్తినప్పుడు వాటిని సరిదిద్దకపోతే దాన్ని తయారీ లోపంగా పరిగణించాలని తేల్చింది.
పాత వాహనం స్థానే కొత్త వాహనాన్ని ఇవ్వటం కానీ.. లేదంటే దానికైన ఖర్చు రూ.14.15 లక్షలు.. మానసికంగా పడిన వేదనకు పరిహారంగా రూ.20వేలు.. ఖర్చుల కింద రూ.5వేలు.. కోర్టుకు ఫిర్యాదు చేసిన తేదీ నుంచి వడ్డీతో చెల్లించాలంటూ వాహనాన్ని అమ్మిన డీలర్ కు ఆదేశాలు జారీ చేసింది. సో.. వాహనాలు కొన్న తర్వాత.. వాటికి తరచూ రిపేర్లు రావటం.. వాటిని పరిష్కరించటంలో కానీ సేవాలోపం తలెత్తితే.. న్యాయం కోసం పోరాడితే ఫలితం ఎలా ఉంటుందనటానికి తాజా ఉదాహరణే నిదర్శనంగా చెప్పొచ్చు.