హెలికాప్టర్ లోంచి హైదరాబాద్ ను చూడండి

Update: 2016-03-01 10:09 GMT
హైదరాబాద్‌ ను గగనతలం నుంచి వీక్షించేందుకు హెలీ టూరిజం అందుబాటులోకి వచ్చింది. మంగళవారం నెక్లెస్‌ రోడ్డులో తెలంగాణ పర్యాటక సంస్థ - ఇండివెల్‌ ఏవియేషన్‌ సంస్థ సంయుక్తంగా ఏర్పాటుచేసిన హెలీ టూరిజం సేవలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు హెలీ టూరిజం సేవలు అందించనున్నట్లు తెలిపారు.     
   
ఇక న్యూయార్క్ - లండన్ లాంటి నగరాల్లో మాదిరిగా హైదరాబాద్ నగరంలో కూడా పర్యాటకులు విహంగ విహారం చేయొచ్చు. హెలికాఫ్టర్‌ లో  ప్రయాణిస్తూ హైదరాబాద్ నగరంలోని చారిత్రక కట్టడాలు - పర్యాటక ప్రాంతాలు - సరస్సులు - ఇతర ఆకర్షణీయాలను తిలకించే అవకాశం కలుగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సాధారణ ప్రజలు, పర్యాటకులు ఇకూడా ఇకపై హైదరాబాద్ నగరంపై హెలికాఫ్టర్‌ లో తిరగవచ్చు.
   
కాగా ఈ హెలికాప్టర్ విహారానికి ఒక్కో టూరిస్ట్ నుంచి 3499 రూపాయలు చార్జీగా తీసుకుంటారు. ఒకేసారి నలుగురు టూరిస్టులు ప్రయాణించవచ్చు. నెక్లెస్ రోడ్డు - హుస్సేన్‌ సాగర్ - బుద్ద విగ్రహం - హెటెక్ సిటీ - దుర్గం చెరువు తదితర ప్రాంతాలను ఈ జాయ్ ట్రిప్ ద్వారా చుట్టిరావచ్చు.
Tags:    

Similar News