ప్రమాణ స్వీకారం చేయకుండానే హైదరాబాద్ కార్పొరేటర్ మరణం
గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా విజయం సాధించిన బీజేపీ కార్పొరేటర్ ఒకరు గురువారం కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన మరణించినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచినప్పటికీ ప్రమాణస్వీకారం చేయకుండానే మరణించారు.
గ్రేటర్ పరిధిలోని లింగోజిగూడ కార్పొరేటర్ గా ఆకుల రమేశ్ గౌడ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మూడు రోజులకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. కరోనా పాజిటివ్ కావటంతో ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేస్తున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం సాయంత్రం కన్నుమూశారు. గతంలో ఎల్బీనగర్ మున్సిపల్ ఛైర్మన్ గా వ్యవహరించిన రమేశ్ గౌడ్.. కార్పొరేటర్ గా గెలిచి.. ప్రమాణస్వీకారం చేయకుండానే మరణించటం అయ్యో అనిపించేలా చేసింది. ఆరోగ్యంగా ఉండే ఆయన్ను మాయదారి కరోనా బలి తీసుకుందని వాపోతున్నారు. ఆయన మరణవార్త విన్నంతనే..బీజేపీ నేతలు.. కార్యకర్తలు ఆయన ఇంటికి చేరి.. కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తున్నారు.