కూటమి మిత్రులు సెంచరీ కొడతారా ?

దానికి ఆ పార్టీ మార్క్ ప్రాతిపదిక ఉందని అంటున్నారు. జనసేన ఓటు షేర్ బాగా పెరుగుతోందని అంటున్నారు. అది డబుల్ డిజిట్ కి చేరుకుందని అంటున్నారు.;

Update: 2026-03-25 16:53 GMT

ఏపీలో పెద్ద ఎత్తున అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి. ఇది అన్ని రాజకీయ పార్టీలలో ఆనందం కలిగిస్తోంది. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లలో పోటీ చేసేందుకు పార్టీలు ప్రణాళికలు రచిస్తూ ఉంటే ఆయా పార్టీలకు చెందిన క్యాడర్ అయితే ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఒక ఏపీ రాజకీయ పార్టీలకు అయితే ఈ సీట్ల పెంపు ఒక జాక్ పాట్ అని చెప్పాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో కూటమిగా మూడు ప్రధాన పార్టీలు ఏర్పడ్డాయి. సీట్ల కోసం ఆయా పార్టీలు ఎంతలా సర్దుబాటు చేసుకున్నాయో అంతా చూశారు. పోటీ చేయాలని ఆశలు ఉన్నా చివరి నిముషంలో చాలా మంది వెనక్కి తగ్గారు. అలాంటి వారికి ఇపుడు న్యాయం చేసే సమయం వచ్చింది అని భావిస్తున్నారు. దాంతో పాటు ఎక్కువగా సీట్లు ఈసారి తీసుకోవాలని కూటమి మిత్ర పార్టీలు జనసేన బీజేపీ భావిస్తున్నాయని ప్రచారం సాగుతోంది.

జనసేన నంబర్ :

ఇక జనసేన విషయానికి వస్తే 2024 ఎన్నికల్లో 30కి పైగా సీట్లు పోటీ చేయాలని చూసిందని ప్రచారంలో ఉంది. అది కాస్తా చివరికి పాతిక దగ్గర ఆగింది. ఆఖరికి 21 తో సరిపెట్టుకున్నారు. అయితే గొప్ప విషయం ఏమిటి అంటే ఆ 21 సీట్లలోనూ జనసేన నూరు శాతం గెలుపు సాధించి తన సత్తాను చాటుకుంది. అదే విధంగా తమకు మూడు ఎంపీ సీట్లు ఇచ్చినా లాస్ట్ లో జరిగిన అడ్జస్టుమెంట్ల వల్ల అనకాపల్లిని వదులుకుంది. దాంతో పోటీ చేసిన రెండు ఎంపీ సీట్లను గెలుచుకుని పార్లమెంట్ లోకి దర్జాగా అడుగుపెట్టింది. ఇక 2029 ఎన్నికల్లో ఇంతకు రెట్టింపు పోటీ చేయాలని జనసేనలో చాలా కాలంగానే ఆలోచనలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఇపుడు అయితే మరో 88 సీట్లు అదనంగా పెరగబోతున్నాయి. దాంతో జనసేన వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 70 దాకా అసెంబ్లీ సీట్లకు పోటీ చేయాలని నిర్ణయించుకుంది అని అంటున్నారు.

యాక్షన్ ప్లాన్ ఇదేనా :

దానికి ఆ పార్టీ మార్క్ ప్రాతిపదిక ఉందని అంటున్నారు. జనసేన ఓటు షేర్ బాగా పెరుగుతోందని అంటున్నారు. అది డబుల్ డిజిట్ కి చేరుకుందని అంటున్నారు. అది కాస్తా 15 శాతం నుంచి ఇరవై శాతం దాకా ఉందని అంటున్నారు. ఈ లెక్కన ఆ రేషియో తీసుకున్నా ఈజీగా అరవై నుంచి డెబ్బై సీట్లకు పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. అలాగే 39 దాకా ఉండే ఎంపీ సీట్లలో పదికి తక్కువ కాకుండా పోటీ చేయాలని జనసేన ఆలోచిస్తోంది అని ప్రచారం సాగుతోంది. ఈ విధంగా చేయడం ద్వారానే క్యాడర్ లీడర్ ఆశలను నెరవేర్చగలమని పార్టీని కూడా విస్తరించుకుని ముందుకు పోగలమని జనసేన యాక్షన్ ప్లాన్ గా ఉంది అంటున్నారు.

బీజేపీ సైతం :

ఇక భారతీయ జనతా పార్టీ కూడా ఏపీ మీద కొత్త ఆశలను పెంచుకుంటోంది. ఎటూ సీట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరగనున్నాయి కాబట్టి కూటమి పొత్తు సీట్లలో తమ వాటా కూడా పెంచుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఆ పార్టీ 2024 ఎన్నికల్లో 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి 8 గెలిచింది. ఇది మంచి రిజల్ట్ గా ఉంది. అప్పట్లోనే 15 దాకా సీట్లు కోరినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సర్దుబాటులో కుదరక తగ్గించుకోవాల్సి వచ్చింది అని అంటున్నారు. ఈసారి మాత్రం 30 అసెంబ్లీ సీట్లను తీసుకోవాలని అనుకుంటోంది అంటున్నారు.

జాతీయ స్థాయిలో కీలకం :

అలాగే ఎంపీ సీట్లు బీజేపీకి చాలా ముఖ్యంగా ఉన్నాయని చెబుతున్నారు. 2024లో 5 కి పోటీ చేసి మూడు గెలుచుకుంది. ఈసారి 10 నుంచి 13 దాకా ఎంపీ సీట్లు తీసుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. అంటే ఇది పెద్ద నంబరే కానీ బీజేపీకి జాతీయ స్థాయిలోనే చాలా కీలకం అవుతుంది కాబట్టి ఎంపీ సీట్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరనే అంటున్నారు. దీనిని బట్టి చూస్తే కూటమిలో జనసేన బీజేపీ కలసి వంద అసెంబ్లీ అలాగే 20 దాకా ఎంపీ సీట్లు పొత్తులో భాగంగా తీసుకునే అవకాశాలు ఉంటాయని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మూడు పార్టీలలో ఏ విధనమైన చర్చలు అవగాహన సాగుతాయన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News