టీడీపీలో కలకలం: డోన్ టికెట్ ఎవరికి.. ?
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కీలక నియోజకవర్గం డోన్ టికెట్‌పై టీడీపీలో కలకలం రేగుతోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఈ టికెట్ విషయంపై సొంత పార్టీ నాయకుల మధ్య వివాదాలు రచ్చకెక్కుతు న్నాయి.;
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కీలక నియోజకవర్గం డోన్ టికెట్‌పై టీడీపీలో కలకలం రేగుతోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఈ టికెట్ విషయంపై సొంత పార్టీ నాయకుల మధ్య వివాదాలు రచ్చకెక్కుతు న్నాయి. వాస్తవానికి ఆది నుంచికూడా తీవ్ర విభాదాలు.. రాజకీయ విమర్శలు ఎక్కువగా ఉన్న కేఈ-కోట్ల కుటుంబాలు వేర్వేరు పార్టీల్లో ఉండేవి. అయితే.. రాజకీయ అవసరాలు.. అవకాశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
గత ఎన్నికల్లో డోన్ టికెట్‌ను సంపాయించుకున్న కోట్ల విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆరోగ్య సమస్యల కారణంగా.. ఆయన ఇటీవల కాలంలో యాక్టివ్ పాలిటిక్స్‌కు కడు దూరంగా ఉన్నారు. ఇదే వ్యవహారం టీడీపీ సీనియర్‌నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రతాప్‌కు కలిసి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేయనున్నానని.. సమస్యలు ఉంటే తనకే చెప్పాలంటూ.. నియోజకవర్గాల్లో సమావేశాలు పెడుతున్నారు.
అంతే కాదు.. పెద్ద ఎత్తున అప్రకటిత ప్రచారం కూడా కేఈ చేస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే టికెట్ దక్కలేదన్న కారణంగా.. కేఈ తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీపైనా.. అధినేతపైనా కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే.. తర్వాత.. సర్దుకుపోయిన ఆయన.. ఇప్పుడు నియోజకవర్గం రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే పనితీరుపై అంతర్గతంగా చర్చ వచ్చేలా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనినీ ఆయనే ప్రారంభిస్తుండడం.. అధికారులపైనా ఒత్తిడితేవడం గమనార్హం.
అయితే.. కోట్ల మాత్రం.. వచ్చే ఎన్నికల్లో కూడా తనే పోటీ చేస్తానని తన అనుచరుల వద్ద చెబుతున్నారు. కానీ.. వాస్తవం ఏంటంటే.. ప్రస్తుతం అనారోగ్య సమస్యల కారణంగా.. కోట్ల పార్టీకి, కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీ పరంగా యాక్టివ్‌గా ఉన్న కేఈ చుట్టే నాయకులు తిరుగుతున్నా రు. ఇక, ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం మౌనంగా ఉంది. జిల్లాకు చెందిన మంత్రులు కూడా మౌనంగా ఉండిపోయారు. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా సమయం ఉందని.. అప్పటి వరకు పరిస్థితి ఎలా ఉన్నా చేసేది లేదని.. జిల్లాకు చెందిన నాయకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.