పేస్ మాస్క్ వాడకంపై స్పైడర్ మ్యాన్ తో హైదరాబాద్ సిటీ పోలీసుల ప్రచారం !

Update: 2020-12-09 06:55 GMT
కరోనా మహమ్మారి జోరు ఏమాత్రం తగ్గినట్టు కనిపించడం లేదు. కానీ, కరోనా కి ఎదురీదుతూ జీవితాన్ని సాగిస్తున్నారు. ఇంకా దేశంలో పలు ప్రాంతాల్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలో కొన్ని కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రజలని మరింత ఆందోళనకి గురిచేస్తుంది. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తీవ్రత భారీగా ఉంది. ఇక ఈ కరోనా విజృంభణ సమయంలో మాస్క్ పెట్టుకోవడం , శానిటైజర్ రాసుకోవడం పరిపాటిగా మారిపోయింది. అలాగే మాస్క్ మాత్రం చాలా ముఖ్యం. కానీ, కొందరు తమకి కరోనా సోకదులే అన్న ఓవర్ కాన్ఫిడెంట్ తో కనీసం పేస్ మాస్క్ కూడా ఉపయోగించడం లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే .. మీరు పేస్ మాస్క్ పెట్టుకోవడం వల్ల , ఇతరులకి లాభం ఏమిలేదు. మీరే కరోనా మహమ్మారి భారిన పడకుండా ఉండొచ్చు. కాబట్టి పేస్ మాస్క్ పెట్టుకోండి అని ఒకరు చెప్పాల్సిన పనిలేదు. అయితే , ప్రభుత్వం , పోలీసులు , రాజకీయ ప్రముఖులు పేస్ మాస్క్ ఖచ్చితంగా ఉపయోగించడండి అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక ఏదైనా ఓ విషయం లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ , ప్రచారం చేయడం లో హైదరాబాద్ సిటీ పోలీసుల తీరు ఎప్పుడూ కూడా హై లెవెల్ లో ఉంటుంది. ఇప్పటికే కరోనా మహమ్మారి నుండి ఎలా తప్పించుకోవాలో రకరకాలుగా ప్రచారం చేస్తున్న  హైదరాబాద్ సిటీ పోలీసులు , తాజాగా ట్విట్టర్ వేదికగా మరో ఆసక్తికరమైన ఫోటో ను షేర్ చేసి .. మాస్క్ అనేది ఎంత ముఖ్యమో తెలియజేసింది.

తాజాగా ఈ రోజు కరోనా అవైర్నెస్ లో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీసులు స్పైడర్ మెన్ ఫోటో షేర్ చేసింది. ఒక్క ఫొటోలో రెండు వేరియేషన్స్ ను చూపిస్తూ ఇంట్లో ఉంటే స్పైడర్ మెన్  కూడా మాస్క్ వాడడు అని , బయటకి వస్తే స్పైడర్ మ్యాన్ ఖచ్చితంగా పేస్ మాస్క్ వెడతాడు అని  చూపిస్తూ .. మీరు కూడా ఇంట్లో పేస్ మాస్క్ వాడకపోయినా ఏమీకాదు కానీ, ఇంటి నుండి బయటకి వచ్చే సమయంలో పేస్ మాస్క్ అనేది ఖచ్చితంగా వాడాలని  విన్నూతనంగా ప్రచారం చేస్తుంది. ఒకరకంగా ఆలోచిస్తే ఇది కూడా నిజమే .. స్పైడర్ మ్యాన్ ఇంట్లో ఉంటే మాస్క్ వాడడు , బయటకి వస్తే మాస్క్ తీయడు. కాబట్టి మనం కూడా స్పైడర్ మ్యాన్ లా మారాల్సిన పరిస్థితి లో ఉన్నామని చెప్తూ హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్టర్ లో ఈ ఫోటో ను పోస్ట్ చేశారు.
Tags:    

Similar News